రైతులపై క‌క్ష‌గ‌ట్టిన‌ ప్రభుత్వం

వారికి అన్యాయం చేస్తోందన్న ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: ‌హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శించారు. అధికార పార్టీ రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శిస్తూ తన అధికారిక ఎక్స్ ‌ఖాతాలో హరీష్‌ ఓ ‌పోస్ట్ ‌చేశారు. ’రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో రైతులందరూ సంఘటితమై ఛలో ప్రజాభవన్‌కు పిలుపునిస్తే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి వొణుకు పుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా రైతులను, రైతు సంఘాల నాయకులను ఎక్కడిక్కడ పోలీసు స్టేషన్లలో నిర్బంధిస్తూ వారిపై కక్ష తీర్చుకుంటోంది.

రుణమాఫీ కోసం పోరుబాట పట్టిన రైతన్నలను అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ పక్షాన దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్టులు చేసిన రైతులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేస్తున్నాం. మాది ఆంక్షలు లేని ప్రభుత్వం, కంచెలు లేని ప్రభుత్వం, ప్రజా పాలన అంటూ డబ్బా కొట్టుకునే రేవంత్‌ ‌రెడ్డి ఇదేంటి?

ప్రజా భవన్‌ ‌చుట్టూ ఎందుకు ఇన్ని బారికేడ్లు, ఎందుకు ఇన్ని ఆంక్షలు? ప్రజాభవన్‌ ‌కు రైతులు తరలివస్తున్నారంటే సీఎంకు ఎందుకు అంత భయం?  అని హ‌రీష్ రావు ప్ర‌శ్నించారు. రైతులందరికి 2లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి, మాట తప్పావు. ఇప్పుడది నీకు, నీ ప్రభుత్వానికి ఉరితాడు కాబోతున్నది. రుణమాఫీ చేసి తీరేదాకా, నిన్ను బీఆర్‌ఎస్‌ ‌పార్టీ వదిలిపెట్టదు, తెలంగాణ రైతాంగం వదిలిపెట్టదు.  అని హరీశ్‌ ‌విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *