Category సన్నివేశం

గోముఖ వ్యాఖ్యలను జనం పసిగట్టలేరా?

కళ్లెదుట ఉన్నదాని నుంచే, మన ముందూ వెనుకా చుట్టూ ఉన్న ప్రపంచం నుంచే అన్నీ పుడతాయి,  విచారమైనా వినోదమైనా, ఆగ్రహమైనా ఆక్రోశమైనా, హహాకారమైనా హాస్యరసమైనా! చుట్టూ ఇన్ని నెత్తుటివరదలున్నాయి కదా, ఇంతటి క్రూరత్వమూ ద్వేషమూ పరచుకున్నాయి కాదా, ఎట్లా చిర్నవ్వగలము, ఎట్లా చక్కిలిగిలి పొందగలము అనుకుంటే, జీవితమే ఉండదు. కాబట్టి, నవరసభరితమైన నాటకాన్ని పంటిబి గువున,…

శాంతి: సాధ్యాసాధ్యాలు, న్యాయాన్యాయాలు

గొంతు మీద కత్తి పెట్టి, చర్చలు చేయాలంటే ఇండియా చేయదు. అనుకూల వాతావరణం వచ్చే వరకు ఆగి, ఆ తరువాత భారత్‌ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఒప్పందాలు చేసుకుంటాము- అన్నారు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌. అమెరికా అధ్యక్షుడు తొంభై రోజుల టారిఫ్‌ విరామానికి స్పందిస్తూ ఆయన అన్నమాటలు అవి. కాంగ్రెస్‌ వైపు నుంచి…

తల బొప్పి కడుతున్నా, తప్పుల మీద తప్పులు!

రేవంత్‌ ‌రెడ్డి ఇటీవలి చేతలకు, మాటలకు నిజానికి ఆయన మీద  కోపం రావాలి. కానీ, జాలి కలుగుతోంది.  కెసిఆర్‌ ‌ప్రభుత్వం మీద పెరుగుతున్న వ్యతిరేకతలో తన భవిష్యత్తును గుర్తించి, అందుకు అనుగుణంగా అడుగులు వేసి, అనుకున్నది సాధించగలిగిన నాయకుడు, ప్రజాపాలన అని చెప్పుకుంటున్న పరిపాలనలో మాత్రం దయనీయంగా విఫలమవుతున్నారు. పదహారునెలలకే తన మీద విముఖత పెరిగి…

బలం తనకే ఉన్నా, భయం తప్పని బాబు!

నేషనల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకుడు, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ ‌పవార్‌ ఈ ‌మధ్య  ఇఫ్తార్‌ ‌కార్యక్రమంలో మాట్లాడుతూ ముస్లిములను ఎవరన్నా ఇబ్బంది పెడితే తాను సహించనని, అండగా ఉంటానని అన్నారు. ఆయన మాటలకు నేపథ్యం-  ‘ఛావా’ సినిమా నేపథ్యంలో నాగపూర్‌ ‌లో జరిగిన హింసాకాండ. మహారాష్ట్ర ప్రభుత్వంలోని మూడు భాగస్వామ్య పార్టీలలో ఆయనది ఒకటి. పవార్‌…

బాధ్యత లేదు, దుర్భాష మాత్రం మిగిలింది

No responsibility, only bad language remains.

అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఎంత హెచ్చు స్థాయిలో ఉంటే ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంతగా క్రియాశీలంగా ఉన్నట్టా? చట్టసభల సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎంతగా బల్లలు పగిలితే, అంతగా కుండలు బద్దలవుతున్నట్టా? రాష్ట్రప్రజల సమస్యలను, అభివృద్ధి అవసరాలను పరిగణనలోనికి తీసుకుని, పరిష్కారాలను అన్వేషిం చడానికి పరస్పరం సంప్రదించుకునే ఉదాత్తత ఉభయ పక్షాలకు ఉండకూడదా? సంక్షేమానికి…

ఓడిపోయి, మద్దెల ఓడు అంటారా?

ఇటాలియన్‌ కమ్యూనిస్టు నాయకుడు గ్రాంసీ ప్రకారం, రాజ్యసంస్థలు తమ వివిధ విభాగాల ద్వారా సాంస్కృతిక, భావజాల ఆధిపత్యాలను అమలు చేస్తాయి. ప్రజల ఆలోచనలను తీర్చిదిద్దుతాయి. అట్లాగే, పౌరసమాజం కూడా ఆధిపత్యాల స్థాపనకు సాధనమే. రాజ్యంలో భాగం కాని సంస్థలు, వ్యక్తులు పౌరసమాజం వేదికగానే, ప్రయోజనాల ఘర్షణలో పాల్గొంటాయి. ప్రజల ఆలోచనలను భిన్నంగా రూపొందించే ప్రయత్నం చేస్తాయి.…

దక్షిణాది పక్షాన, తెలంగాణ గొంతుతో మాట్లాడిన రేవంత్‌!

తెలంగాణలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు తమకు మూలాల నుంచి ముప్పు తెస్తున్న భారతీయ జనతాపార్టీ జైత్రయాత్రను నిరోధించడానికి, దీటైన సైద్ధాంతిక వైఖరులను ఆశ్రయించడమే మార్గం. సమాజంలో విద్వేషాలను తగ్గించి, సామరస్య భావాలను వ్యాపింప చేయడానికి ఉధృతంగా సాంస్కృతిక ప్రచారం, యువజనులను నిమగ్నం చేసే వివిధ కార్యక్రమాల రూపకల్పన, దక్షిణాదికి, ముఖ్యంగా తెలంగాణకు డీలిమిటేషన్‌ వల్ల కలిగే…

పడిపోతారా? పడగొడతారా !?

ఊహలు, కలలు రెండు వైపులా పదును ఉన్న కత్తులు. అవి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని  ఇచ్చేమాట ఎంత నిజమో, మత్తును, మభ్యపాటును, ఆత్మవంచన ను కలిగించే మాట కూడా అంత నిజం. కోలుకోలేని ఓటమి వాస్తవ ప్రపంచంలో ఎదుర య్యాక, ఏదో ఒక అవాస్తవ ఊహను కావులిం చుకుంటే తప్ప, మనోవ్యాధి తీరదు. తెలంగాణ రాష్ట్రమూ, కెసిఆర్‌…

ఈ కైలాసం ఆటలో అన్నీ పాములే, నిచ్చెనలెక్కడ?

వేములవాడ భీమకవి రాజు కళింగ గంగును చూడడానికి వెళ్లాడట. తనని చూసి కూడా రాజు ‘ సందడి తీరిన వెన్క’ రమ్మన్నాడట. కవికి కోపం వచ్చింది. ముప్పై రెండు రోజుల్లో నీ అహంకారానికి కారణమైన వైభవమంతా నశించిపోతుందని శాపం పెట్టాడట. ఇది ఆధునిక కాలం కదా, శాపాలు వగైరా చెల్లుబాటు కావు. జనం మనసులు నొచ్చుకుంటే…

You cannot copy content of this page