Category ఎలమంద

బడిబువ్వకు ‘తిథి తిప్పలు’!

గుడ్డెద్దు శేన్ల పడుడంటే గీ తీర్గనే! సదూకునే పోరల్లకు బళ్ళె అంబటేల బెట్టేడి బడి బువ్వనే కాదుల్లా! ఇటు సంది వూరోళ్ళను సుత బువ్వ పెట్టమంటాంది మన సర్కార్‌ ! ఏ ఇంట్ల యెసోంటి పబోజనమైనా, సుట్టాలకింత బెట్టినట్టే వూరి బడి పోరల్లకింత బువ్వ పెట్టాలంటాంది. యెందుకంటె పబోజనం కాడి బువ్వ జరింత అవ్వల్‌ టది.…

సదువుకు పాడె గట్టి.. సంబురాల డప్పులా!!

పానాలు తీశేటి  యెండలు దంచి కొడ్తానయి. నిప్పుల కొలిమోలిగె గాలులు ఇసిరిసిరి కొట్టబట్టె గలుమ దాటకుండి పైలం వుల్లా! అని టీ వీ లల్ల జెప్పబట్టె! తెలంగాణా సంబురాలు జోరుగుండాలె! బడి పిలగాండ్ల తోని రాలీలు తీయాలె!రోడ్ల పొంటి వీధి బాగోతులాడాలె అని సర్కార్‌ ‌జెప్పబట్టె !బళ్ళు తెరిశి రొండు వారాలాయె! వొయ్యిలిచ్చే జాడ లేదాయె!…

ఎవలిపాలాయె బతుకమ్మ!

‘‘‌బతుకమ్మ మన చెరువు పండుగ,మన నీళ్ళ పండుగ, మన శేనుశెల్కల  పొంటి పెరిగి మనల పల్కరిచ్చేటి తంగెడి పూల,గునుగు,గోరంట పూల పండుగ. గోడ పొంటి పారేటి గుమ్మడి, కాకర, బీర, కట్ల తీగలకు బూషిన తీరొక్క రంగుల పూల పండుగ!  బతుకమ్మ సాచ్చిగ తెలంగాణ యెవలికచ్చిందనేది యెరికైతాంది గద!  దొరలరాజ్జెం మళ్ళ పానం బట్టింది,తెలంగాణ కు…

ఎవలి పాట వాళ్ళదే! ముందస్తుకు ముగ్గులే!

‘‘‌విమోచనమైనా ! విలీనమైనా! తెలంగాణ పల్లెలల్ల ఎగిరిన ఎర్రజెండ సమాధి మీద రేపటి ఓట్ల పండుగ పూలు పూయించే గీ దినం జోరుగ పండుగ జేశిండ్లు.ఎవలి ఫాయిదాల లెక్కన గాళ్ళు  మునుగోడు నుంచి ముందస్తు దాంక ముగ్గు బోశిండ్లు. మతం మత్తుమందు సల్లుడైంది. గులాల్‌ ‌బూసుడైంది.చరిత్ర లున్న నిజాలు దాశిపెట్టి, అడ్డగోలు కతలువడ్డోల్లు చరిత్రల కాన్రాకుంట…