ఈ ఉన్మాదాన్ని అడ్డుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

గత శనివారం నాడు హైదరాబాద్ శివార్లలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రాంగణంలోని ప్రధాన పూజారి రంగరాజన్ ఇంట్లోకి రామరాజ్యం సేన నాయకుడు వీరరాఘవరెడ్డితో సహా దాదాపు ఇరవై మంది ఆగంతుకులు జొరబడ్డారు. ఆ దుండగులు దాదాపు నలభై నిమిషాల పాటు వయోవృద్ధుడైన రంగరాజన్ ను, ఆయన కొడుకును వేధించారని, కొట్టారని, బూటు కాళ్లతో తన్నారని, దుర్భాషలాడారని…