Category కవితా శాల

సమయం అశాశ్వతం

Time is impermanent

సమయం కాలపు దుప్పటి కాల శిశిరంలో రాలిపోయే మహా వృక్షం మానవ శరీరం వసంతోదయం నిల్వదు కలకాలం సమయమేవ్వరికీ కాదు శాశ్వతం ఊప్పోంగే బలం లేక్కచేయని గర్వం కోర్కేల రేక్కలతో ఎగిరే నరుడి దాహం ఇవీ కావు జీవితం కు పరమార్ధం స్వార్థభాస్వరం కీర్తిని చేయు దగ్దం సమయమేవ్వరికీ కాదు శాశ్వతం వసంత చిగురు చూసీ…

ఆగదు నా ప్రయాణం…

కారు మబ్బుల్లో..కమ్ముకున్న చీకట్లలో.. సాగుతోంది నా ప్రయాణం దారి చూపడానికి చంద్రుడు కూడా లేడు బహుశా ఈరోజు అమావాస్య నేమో అయినా ఆగదు నా ప్రయాణం..నా చుట్టూ భయంకరంగా కమ్ముకున్న చీకట్లు అయినా నాలో అణుకు లేదు బెణుకు లేదు చేతిలో ఓ నిప్పు కాగడ పట్టుకొని ఛాతి నిండా ధైర్యంతో ముందుకు సాగుతోంది నా…

మాన‌వీయ క‌వితా స్ప‌ర్శ‌…

క‌విత్వంలో  ఎడ‌తెగ‌ని భావ‌ధార ఏ గిరిగీత‌ల‌కు త‌ల‌వంచ‌క ప్ర‌వాహ‌మై సాగితే అద్భుత స‌త్యాల ఆవిష్క‌ర‌ణ‌కు అది సాక్ష్యంగా నిలిచిపోతుంది. అనేకానేక సంవేద‌న‌ల్ని, సంఘ‌ర్ష‌ణ‌ల్ని క‌విత్వీక‌రించ‌డం ద్వారా మ‌నిషి చేసే నిత్య జీవ‌న యుద్ధ‌మెంత భ‌యంక‌ర‌మైందో ఎంతో  స్ప‌ష్టంగా ప్ర‌ముఖ క‌వ‌యిత్రి  మహెజ‌బీన్  ఆకురాలు కాలం  క‌వితాసంపుటిలోని క‌విత‌ల ద్వారా  చెప్పారు. ప్ర‌శ్న‌ల్ని సంధించి, సూటిద‌నంతో ఖ‌రాఖండీగా…

శ్రామిక మహోత్సవం

పెట్టుబడిదారి చేష్టల దిక్కరిస్తూ శ్రామిక లోకం పిడికిలెత్తిన  దినం తరాల బానిసత్వాన్ని నిరసిస్తూ శ్రమ శక్తి కదంతొక్కిన సందర్భం శ్రమ దోపిడికి వ్యతిరేకంగా కార్మిక వర్గం నినదించిన దినం నేడే ప్రపంచ కార్మిక దినోత్సవం చికాగో నగర హేమార్కెట్లో… అమర వీరుల ఆత్మ బలిదానం కోట్లాది కార్మిక నెత్తుటి తర్పణం కళ్లెదుట నిలిపే చారిత్రక దినం…

చివరకు మిగిలేది?

పుట్టుకతోనే ప్రతి క్షణం – మరణిస్తున్నాం! మృత్యువు ప్రతీ క్షణం ఒక్కో క్షణాన్ని మింగేస్తూనే వుంది … దాని తుది  అఘాతమే మరణం! పుట్టుట – పెరుగుట కొంతకాలం ‘స్థితి’ని కలిగి ఉండుట … ఏవేవో సృష్టించుట – క్షీణించుట … చివరకు నశించుట! ఇదంతటికి మూలం… జన్మించుట… ..అనే తొలి ఉద్భవంతో … కర్మానుసారం…

అంతు పట్టదు…!!

అమ్మదో మతం నాన్నదో మతం అటు బైబిల్‌ ఇటు  భగవద్గీత బొట్టుకోసం సావిత్రి యుముడితో కోట్లాడిరదని తెలుగు వుస్తకంలో చదివాను! మరి నాన్నబతికుండగానే అమ్మ బొట్టెందుకు చెరిపేసుకుందో ! ఎన్ని సాంఘిక శాస్త్రాలు చదివినా అంతుబట్టదు……!! -శోభరమేష్‌ 8978656327

epaper.velthuru.comఅనామక వేదనకు అక్షరాకృతి…

కవిత్వం మనకు మనం వెతుక్కునే జ్ఞానదిశ/కవిత్వం మనకు మనం చేసుకునే విచికిత్స అని ప్రఖ్యాత కవి డాక్టర్‌ బెల్లి యాదయ్య చెప్పినట్టుగా ఎన్నో జీవన సంఘటనల నుండి సందర్భోచిత కోణాలు నిరంతర, నిత్యనూతన కవి దండమూడి శ్రీచరణ్‌ కవిత్వంలో కోకొల్లలుగా కన్పిస్తాయి. మధూళి  పేరిట ఆయన కవితా సంపుటి వెలువడిరది. నిశీధిలో నిశ్శబ్దం విషాదాన్ని పలికిస్తుంటే…

జీవన సంపద

నాలో నీవు నీలో నేను ఉండేదెపుడు జీవననాణ్యంగా మారినపుడు… నా రూపు నీ రూపు రూపు దిద్దు కునేదెపుడు పాపాయి నవ్వి నపుడు… జీవన సారం బంధాల పూలహారం తరతరాల వరం కాపాడు కోవాలి బంగారు ఆభరణం -రేడియమ్‌ 9291527757

జీవన సందర్భాల అల్లిక…

ఆశ… విత్తనం లేకుండా పెరిగిన మొక్క యొక్క శ్వాస అంటారు దర్పణం అన్న కవితలో అలిశెట్టి ప్రభాకర్‌. ఆశల చుట్టూ అల్లిన ఆశయాల పూల పొదరింటి వాకిలి కవిత్వం. విత్తన కలలు వాస్తవాల నడకలైతే సహజమైన నైసర్గిక ఆవిష్కృతి జరుగుతుంది. పరిణామాన్ని కోరితేనే కవిత్వం జ్ఞానదిశను అన్వేషిస్తూ వెనుదిరుగని ప్రయాణం  చేస్తుందన్నది నిగ్గుతేలిన నిజం. గాయానికి…

You cannot copy content of this page