Category సాహిత్యం-శోభ

ఆకలి చంపిందా? రచయిత దృక్పథం చంపిందా?

కథాతీతం : బాలాజీ పోతుల యుద్ధం మనుషుల్ని చంపుతుంది; ఆకలీ చంపుతుంది. అదే ఆకలి యుద్ధ వాతావరణంలో తీవ్రరూపం దాల్చినప్పుడు మనిషిని ఎంతటి అమానుష చర్యకైనా పురికొల్పగలదా? ఒకప్పుడు ప్రాణాల్ని కాపాడిన వ్యక్తే ప్రాణాల్ని తీసే స్థితికి దిగజారితే, దాన్ని ఆకలి అనివార్య పరిణామంగా భావించాలా? లేక అలా చిత్రించిన రచయిత దృక్పథాన్ని ప్రశ్నించాలా? ఎం.వి.…

శకలం – సకలం

కాలం ఏ గాలానికీ చిక్కుకోదు గంట చుట్టూ గాలి ఉన్నా  గంటను మోగించలేదు పెదవి కదపనంత వరకు  ఏ పదానికీ  ఉలుకూ పలుకూ ఉండదు  అలలు ఎంత ఎత్తు ఎగరనీ ఆకాశం అణుమాత్రం కదలదు మేఘాలన్నీ గుంపు కట్టి నడిచినా పక్షులన్నీ బారులు తీరి సాగినా నింగి మాత్రం ఒంటరి తడియారని కళ్ళలో దుఃఖం విస్ఫోటించదు …

లవ్ స్టోరీ!-బమ్మిడి జగదీశ్వరరావు

“మనిద్దరికీ యింక బ్రేకప్” చెప్పిందా అమ్మాయి. అబ్బాయి యేమీ మాట్లాడలేదు. “ఇనిపిస్తలేదా? బ్రేకప్ చెప్పినగ, యింక పో…” అని కూడా అనేసింది. అబ్బాయి దించిన తలయెత్తి అమ్మాయి ముఖంలోకి చూడాలనుకున్నాడు. కాని అవకాశం లేకపోయింది. చీకటి నీడల్లో నీడల్లాగ కలిసిపోయి నిలబడ్డారిద్దరూ. అమీర్ పేట హాస్టళ్ళ దగ్గర అందరు అమ్మాయిలూ అబ్బాయిలూ కలుసుకున్నట్టే తాము రోజూ…

సర్కస్ పులి

రెండు తెలతెల్లని ముసలి ఆవుల్లాంటి  ఇద్దరు అవ్వలు  మాజీ ఆటగత్తెలు  నలుగురు ఆడపిల్లలు  రేపటి ఆట బుర్రకెక్కించుకుంటున్న విద్యార్థినులు   మీసం దువ్వే  పురుషుడొక్కడు  సింహం జూలు తగిలించుకున్న మేకపోతు  పనికి వొంగినట్టు నటించే సూపర్ వైజరు  వాడు మామూలోడు కాదు  మనసు కరిగిపోయే మాటలు  మంత్రంలా చదువు వాడు  ఆమె  పిల్లల్ని వెంటబెట్టుకొని  ఊళ్ళోకి…

చితి చింతన

కాలంతో కాయం సోలి తూలి పోతుంది చితి చింతన దాచిన సొమ్ము ఇంకా పోతే పోనిమ్ము రాదు వెంట కదమ్మ చివరి కాలం వడ్డున పడ్డ మీనం వీడు అజ్ఞానం కాస్త వైరాగ్యం అందరికి అవసరం చివరి సంధ్యలో శాంతి జీవనం   -రేడియమ్

రెండుతరాల కవిసంగమం’లో వారాల ఆనంద్

‘కవిసంగమం’ నిర్వహణలో అక్టోబర్ పదవతేదీన హైదరాబాద్ శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం, సుల్తాన్ బజార్ (రాంకోఠి) లో జరుగనున్న ‘రెండుతరాల కవిసంగమం’లో సీనియర్ కవిగా కేంద్ర సాహిత్య అకాడెమి అనువాద పురస్కార గ్రహీత వారాల ఆనంద్ పాల్గొంటారు. రెండవ శనివారం సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో కొత్తతరం కవులు హాథీరామ్ సభావట్, చిట్ల ప్రేమ్…

సంతోషం గెలుచుకోవడం ఎలా? -డా. జె. రవీంద్రనాథ్

బెర్ట్రాండ్ రస్సెల్ (1872-1970) ఆధునిక, హేతుబద్ధ ఆలోచనకు విఖ్యాతి గన్న బ్రిటీష్ గణిత శాస్త్రవేత్త, తత్వవేత్త, సామాజిక విమర్శకుడు, శాంతి ఉద్యమనేత. 1952లో నోబెల్ బహుమతి పొందిన ఆయన  రచనల్లో “ప్రిన్సిపియా మాథెమాటికా”, “ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫిలాసఫీ”, “మ్యారేజ్ అండ్ మోరల్స్”, “ప్రిన్సిపుల్స్ ఆఫ్ సోషల్ రికన్స్ట్రక్షన్”, “ది హిస్టరీ ఆఫ్ వెస్ట్రన్ ఫిలాసఫీ”,…

హేత్వాభాష!-బమ్మిడి జగదీశ్వరరావు

·        మెరుపు తీగెలు “నీకు తెలుసు కదా? మావాడ్ని దుంపల బళ్ళో కాదు, మొదట్నుంచీ ఇంగ్లీష్ మీడియంలోనే ప్రవేటు స్కూళ్ళల్లోనే చదివించాము” అన్నాడు మిత్రుడు. తలాడించాను నేను. “ఒక్కడే చాలనుకున్నాం, బాగా చదివించాలని మాత్రం అనుకున్నాం” అంది మిత్రుడిభార్య. నవ్వుతూ చూశాను. “మావాడి నర్సరీ యల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ దాక ఎమ్మెన్నార్‌లో తరువాత నలందాకి…

అహింసా కావ్యం

అలసిపోని నీ అపజయాల వాగు అనునిత్యం పొంగిపొర్లుతుంటే ఆగని నీ ప్రయత్నాల అలలు అందులో ఎగిసెగిసి పడుతుంటే అందమైన నీ విజయ సంగీతం నీ చేతి గీతల బతుకు రాతను చెరిపేస్తూ చరిత విను వీధుల్లో శ్రావ్య గానమై వినిపిస్తుంది నీ జీవితమే.. గాయాల గేయాల స్ఫూర్తి సాహిత్యమై కొన్నితరాల గుండెల్లో డోలనాలు చేస్తుంది..! కట్టుకున్న…