Category తెలంగాణార్థం

జర్నలిస్టుల లిస్టులు తయారు చేసేదెవరు?

 ‘‘ఉప్పు పాతరేస్తా…’’. ‘‘ఎవ్వరినీ వదలను.’’ ‘‘మీడియా మిత్రులను, సంఘాల నాయకులను అడుగుతున్నా. జర్నలిస్టులెవరో లిస్టు ఇవ్వండి. జర్నలిస్టు అనే పదానికి డెఫినిషన్‌ ‌చెప్పండి. ఆ లిస్టులో ఉన్నవాళ్లు ఇట్లా తప్పు చేస్తే మీరు ఏమి శిక్ష విధిస్తారో చెప్పండి. ఆ లిస్టులో లేనివాడు జర్నలిస్టు కాదు. క్రిమినల్స్ ‌గానే చూస్తాం. ఎట్ల జవాబు చెప్పాల్నో అట్లనే…

వరంగల్‌ కు గాలిమోటరూ, గాలి మాటలూ!

ఎట్టకేలకు వరంగల్‌ (మామునూరు) విమానా శ్రయం కదలిక ప్రారంభమయింది. రాష్ట్రంలో హైదరా బాద్‌ (శంషాబాద్‌) అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత రెండో విమానాశ్రయంగా వరంగల్‌ విమానా శ్రయం రాబోతున్నది. నిజానికి రెండో ప్రపంచ యుద్ధ కాలానికి ముందే 1930లలో నిర్మాణమైన ఈ విమానాశ్రయం ఇరవయో శతాబ్ది తొలి అర్ధభాగంలో దేశంలో ప్రధానమైన విమానాశ్రయాల్లో ఒకటిగా ఉండిరది. అది…

మనిషి ప్రాణం విలువ తెలిసిన సమాజమేనా?

నాలుగు రోజులుగా శ్రీశైలం లెఫ్ట్ ‌బ్యాంక్‌ ‌కెనాల్‌ ‌సొరంగంలో చిక్కుకుపోయిన అభాగ్యుల కోసం నిస్సహాయ ఆగ్రహం, ఓపలేని దుఃఖం పోటెత్తుతున్నాయి. శనివారం పొద్దున ఆ చీకటి గుయ్యారంలో దిగ్బంధంలోకి పోయిన ఆ ఎనిమిది మంది ప్రాణాలు ఇది రాస్తున్న సమయానికి ఇంకా నిలిచి ఉన్నాయో లేదో తెలియదు. వాళ్లను సజీవంగా బైటికి తీసుకు రాగలమా లేదా…

తెలంగాణ సామాజిక చరిత్రలో ఒక మలుపు

 ‘చారిత్రక విభాత సంధ్యల మానవ కథ వికాసమెట్టిది’ అని శ్రీశ్రీ అన్నమాట తనకు తాను వేసుకున్న ప్రశ్ననో, ఎవరికో వేసిన ప్రశ్ననో కాదు. అది ఎవరికి వారు చేసుకోవలసిన ఆలోచనా ధారకు మేల్కొలుపు. మానవ కథా వికాసం ఒంటరి మనిషిదీ కావచ్చు, ఒక కుదురుదీ కుటుంబానిదీ కావచ్చు, ఒక సమూహానిదీ సమాజానిదీ కావచ్చు. ఒక దేశానిదీ…

ఈ ఉన్మాదాన్ని అడ్డుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

గత శనివారం నాడు హైదరాబాద్‌ ‌శివార్లలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రాంగణంలోని ప్రధాన పూజారి రంగరాజన్‌ ఇం‌ట్లోకి రామరాజ్యం సేన నాయకుడు వీరరాఘవరెడ్డితో సహా దాదాపు ఇరవై మంది ఆగంతుకులు జొరబడ్డారు. ఆ దుండగులు దాదాపు నలభై నిమిషాల పాటు వయోవృద్ధుడైన రంగరాజన్‌ ‌ను, ఆయన కొడుకును వేధించారని, కొట్టారని, బూటు కాళ్లతో తన్నారని, దుర్భాషలాడారని…

అణగారిన కులాలకు మేలు చేయాలని ఉందా?

ఈ శీర్షికలోనే 2024 నవంబర్‌ 7‌న రాసిన వ్యాసంలో ‘‘…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల గణనను చేపట్టడం, ప్రత్యేకంగా రాహుల్‌ ‌గాంధీ ఈ కార్యక్రమ ప్రార ంభం కోసం రావడం ఆహ్వానించదగిన సంగ తులే. కాని కులగణన విషయంలో కాంగ్రెస్‌ ‌చరిత్ర వల్ల, తెలంగాణ ప్రభుత్వ చరిత్ర వల్ల, ఇతర రాష్ట్రాల కులగణన అనుభవాల వల్ల…

దొందూ దొందే, అందరివీ అబద్ధావోస్‌ ‌లే!!

స్విట్జర్లాండ్‌ ‌లోని దావోస్‌ ‌లో జనవరి 20-24 ల్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్‌ ‌ఫోరం సదస్సులో ఒక లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాల మీద సంతకాలు జరిగాయని రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకు ముందు 2024 జనవరిలో జరిగిన సమావేశాల్లో ఇట్లాగే రు. 40,232 కోట్ల ఒప్పందాలు కుదిరాయని…

బంధుతో, భరోసాతో అసలు సమస్యలు పోతాయా?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదివారం, జనవరి 26న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్కార్డులు అనే నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభిస్తున్నది. ఈ పథకాల ప్రయోజనం పొందాలంటే ప్రభుత్వాధికారులు సర్వే చేసి రూపొందించిన జాబితాలో పేరు ఉండాలనే షరతు ఇప్పటికే కొంత గందరగోళానికి దారి తీస్తున్నది. ఆ జాబితాలను…

రుణభార అభివృద్ధి నమూనా: దొందూ దొందే!

తెలంగాణ రాష్ట్రం దేశీ విదేశీ రుణాల విషవలయంలో చిక్కుకుని అప్పుల కుప్పగా మారిపోతున్నదని, ఇవాళ్టి “అభివృద్ధి అవసరాల” పేరుతో భవిష్యత్ తరాల జీవితాలను తాకట్టు పెట్టి, రాజకీయ నాయకుల, అధికారుల బొక్కసాలు నింపుకునే పాలక అవినీతి వ్యూహాలు కొనసాగుతున్నాయని గత పదకొండు సంవత్సరాలుగా వేరువేరు వేదికల మీద రాస్తూ, మాట్లాడుతూ ఉన్నాను. ఆ మాటకొస్తే ఇది తెలంగాణ రాష్ట్రపు కొత్త జాడ్యం…

You cannot copy content of this page