రసమండలి

కలలు, కోర్కెలూ కర్తవ్యాలు, బాధ్యతలు కలగలిసి కమ్ముకునే బ్రతుకుమలుపులో ఉన్నాన్నేను. రోజుకొక్క రెండు గంటలు అదనంగా దొరికితే లోకాన్నేలేస్తానన్న భ్రమ చాలాసార్లు నన్నొదలదు. తలకెత్తుకున్న పనులే పూర్తిచేయలేక నిస్సత్తువలో సోలిపోయేటప్పుడు మాత్రం ఎందుకూ కొరగాననిపించే దిగులు బోనస్. సమస్యేమిటంటే, ఏ వ్యాపకం శక్తినిస్తోందో, ఏది శక్తిని కోరుతోందోగమనించుకునే తీరికదొరక్క పోవడం. వెయ్యిరకాలుగా అక్కరకురాగల మొబైల్కూడా, రీచార్జ్…