చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే స్టేష‌న్‌లో భారీ అగ్నిప్రమాదం

– ఖాలీ రైలు బోగీల్లో చెలరేగిన మంటలు
– ప్లాట్ ఫాం నం. 5, 6 మధ్య నిలిపి ఉంచిన కోచ్ లకు వ్యాపించిన మంటలు
– ఆకాశాన్ని కమ్మేసిన దట్టమైన పొగలు
– సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
– సురక్షిత ప్రాంతాలకు ప్రయాణికుల తరలింపు
– మంటలను అదుపులోకి తెస్తున్న ఫైర్ సిబ్బంది

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : చర్లపల్లి రైల్వే స్టేషన్ ఆవరణలో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవిం చింది. స్టేషన్లోని ప్లాట్ఫారమ్ నంబర్ 5, 6 మధ్య నిలిపి ఉంచిన ఓ ఖాళీ రైలు బోగీల్లో అకస్మాత్తుగా మంటలు చెలరే గాయి. క్షణాల్లోనే మంటలు పక్కనున్న ఇతర బోగీలకు కూడా వ్యాపించడంతో దట్టమైన పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. ఈ ఘటనతో స్టేషన్ ప్రాంగణంలోని ప్రయాణికులు తీవ్ర భయాం దోళనకు గురయ్యారు.

సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

బోగీల నుంచి మంటలు, పొగలు రావడాన్ని గమనించిన రైల్వే స్టేషన్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రమాద తీవ్రత పెరగకముందే ప్లాట్ఫా రమపై ఉన్న ప్రయాణికులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలు ఇతర రైళ్లకు, స్టేషన్ ఆస్తులకు వ్యాపిం చకుండా ఉండేందుకు తక్షణమే విద్యుత్ సరఫరాను నిలిపివేసి, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రైల్వే పోలీసులు స్థా నిక ఉన్నతాధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాద సమయంలో రైలు కోచ్ పూర్తిగా ఖాళీగా ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *