భజన సంస్కృతీ, విభజన సంస్కృతీ, సమాజ దుస్థితీ!

“సామాజిక శాస్త్రంలో కులం గురించి వివరణలో పుట్టుక, వంశపారంపర్యవృత్తి వంటి లక్షణాలతో పాటు ఇతర కుల సమూహాలతో కంచం పొత్తు, మంచం పొత్తు లేకపోవడం అనే వివరణ కూడా ఉంది. సహపంక్తి భోజన సంబంధాలు, వైవాహిక సంబంధాలు అనే భావనలను కంచం, మంచం అని సరళం చేసి (బహుశా చౌకబారుగా మార్చి) రాసినవాళ్లున్నారు. సామాజిక, సామూహిక…