చదువుకున్న సంస్కార హీనుడు కేటీఆర్..

  • రాష్ట్ర అభివృద్ధి చూసి బిఆర్ఎస్ నేత‌ల‌కు లాగులు తడుస్తున్నాయి..
  • వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్‌రెడ్డి

హన్మకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 :  బిఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ చ‌దువుకున్న సంస్కారహీనుడ‌ని వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి విమ‌ర్శించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై నాయిని రాజేంద‌ర్ రెడ్డి విసిరిన సవాల్ లో భాగంగా ఆదివారం 10 గంటలకు నయీంనగర్ బ్రిడ్జి వ‌ద్ద ఆధారాలతో మీడియా ముందుకు వ‌చ్చారు. ఈసంద‌ర్భంగా ఎమ్మెల్యే పుష్పాభిషేకంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల‌కు దీటుగా సమాధానమిచ్చారు. ఆయ‌న మాట్లాడుతూ.. వాడు వీడు అనే పదజాలం వాడుతున్న కేటీఆర్ ఇదేనా నీ సంస్కారం.. అంటూ నిల‌దీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నయీం నగర్ బ్రిడ్జి నిర్మాణం జరిగితే, మీరు కట్టారు అనడం మీ అవివేకానికి నిద‌ర్శ‌న‌మని అన్నారు. మీ మాదిరి మాటలు చెప్పే తత్వం నాది కాదు. 3రోజుల క్రితం విసిన సవాల్ ప్రకారం నేను ఆదివారం 10 గంటలకు వచ్చాను. న‌యీం నగర్ పరిసర ప్రాంతాల ప్రజలను, వ్యాపార వాణిజ్య శ్రేణులను అడగండి… న‌యీం నగర్ బ్రిడ్జి బీఆర్ఎస్ ప్ర‌భుత్వం నిర్మించింద‌ని ఏ ఒక్కరు చెప్పినా రాజీనామా చేస్తా అని స్పష్టం చేశారు. దొంగ యుట్యూబ్ ఛానెళ్ల‌తో పబ్బం గడిపే మీకు మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. రోజుకు ఒక్కసారి దొంగల్లా మీడియాలో మాట్లాడటం మళ్లీ ఫామ్ హౌజుల‌కు పోవ‌డం మీకు అలవాటేన‌ని అన్నారు.

న‌యీం నగర్ బ్రిడ్జి నిర్మాణం మొదటి దశ నుంచి బీజేపీ కార్పొరేటర్, స్థానిక ప్రజలు ఉన్నారు. ప్రతి రోజు నేను, మేయర్, కలెక్టర్,కమిషనర్ ఇతర అధికారులంతా పర్యవేక్షించామ‌ని, ప్రజలు పక్కనబెట్టినా మీ బుద్ధి ఇంకా మారలేదు, మీ అహంకారం పోలేదన్నారు. అభివృద్ధి చేయలేని దద్దమ్మలు హరీష్ రావు, కేటీఆర్ అని రాజేంద‌ర్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. వారి మాటలు కోటలు దాటుతాయని కానీ చేతలు వాకిలి కూడా దాటలేవని ఎద్దేవాచేశారు. తాను పుష్పాభిషేకం కోరుకోలేద‌ని, ప్రజలు తమ అభిమాని ఆ రూపంలో చూపించడంపై వారు త‌ట్టుకోలేక‌పోతున్నార‌ని విమ‌ర్శించారు. మీ మాదిరి ఏ రోజు కూడా కాళ్ళు మొక్కిచ్చుకోలేద‌ని కేటీఆర్ ను విమ‌ర్శించారు.నేను మాటలలో డబల్ పిజి చేశాన‌ని, నేను నోరు తెరిస్తే నువ్వూ.. నీ సువర్టుపురం బ్యాచ్ ఉండదు. .నిజంగా నీ పనులకు కిల్ బిల్ పాండే బిరుదు సరిగా ఉంటుంద‌ని ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులు,ఎమ్మెల్యేలం అభివృద్ధి దిశగా వెళ్తుంటే మీరు ఒంటబ‌ట్టడం లేదు. మీ ఫామ్ హౌస్ లు పోతున్నాయనే భయంతో హైడ్రాపై విమర్శలు చేస్తున్నారు. మీ పదేళ్ల పాపానికి ప్రాయశ్చిత్తంగా మేము హైడ్రా తో పవిత్రం చేస్తున్నాం..మద్రాస్ బాబు నువ్వు నీ మాటలు ఇంకా ప్రజలు వినే స్థితిలో లేరని నాయిని రాజేంద‌ర్‌రెడ్డి అన్నారు. 95% శాతం పనులను మేము చేశాం అని చెప్తుంటే ఈ రోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంద‌న్నారు. సింగిల్ చెక్ ద్వారా 45కోట్ల పై చిలుకు నిధులను కేటాయించి ఈ రోజు కాళోజీ కళాక్షేత్రం నిర్మించిన ఘనత త‌మ‌ప్ర‌భుత్వానిద‌ని రాజేంద‌ర్ రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *