హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: ఆక్టోపస్ బృందం ఆధ్వర్యంలో ఆక్టోపస్ ఎకో స్వాట్ టీం ఎస్‌వోసీ/డీఎస్పీ బి.మరియదాసు నాయకత్వంలో వివిధ శాఖల సమన్వయంతో సచివాలయంలో శుక్రవారం ఆపరేషనల్ మాక్ డ్రిల్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ పోలీస్, అగ్నిమాపక శాఖ, సీఎస్‌జీ , తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ (టీజీఎస్పీఎఫ్), ట్రాఫిక్ పోలీస్, వైద్య బృందం, బాంబ్ డిస్పోజల్ బృందాలు పాల్గొన్నాయి. సచివాలయంలో ఏవైనా అనుకోని భద్రతాపరమైన ముప్పు లేదా అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వివిధ భద్రతా, అత్యవసర సేవల విభాగాల సన్నద్ధత, పరస్పర సమన్వయం, స్పందనా సామర్థ్యం, కార్యాచరణ సామర్థ్యాలను అంచనా వేయడం, మరింత బలోపేతం చేయడం ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశం. ఈ విన్యాసంలో ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ (అసాల్ట్ కమాండర్) రఘునందన్ రావు, టీజీఎస్పీఎఫ్ సచివాలయం సీఎఉస్‌వో పి.దేవిదాస్, సచివాలయం ఏసీపీ శంకర్, అక్టోపస్ డీఎస్పీ రామకృష్ణ, ట్రాఫిక్ ఏసీపీ మోహన్ రావు, టీజీఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్లు పవన్ కుమార్, సత్తయ్య పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





