నిర్దుష్ట విధానం లేదు…

బడ్జెట్‌ ఒట్టి డొల్ల..అన్ని రంగాలను మోసం
వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ పాలసీలపై అస్పష్టత
బడ్జెట్‌పై మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తీవ్ర అసంతృప్తి…ప్రభుత్వంపై విమర్శలు
ఓటమి తరవాత తొలిసారి అసెంబ్లీకి హాజరు…మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడిన కెసిఆర్‌
బడ్జెట్‌పై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని వెల్లడి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ పాలసీలపై నిర్దిష్టమైన విధానం లేదని బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్‌ విమర్శించారు. ఒత్తి పలకడం తప్ప భట్టి కొత్తగా చెప్పిందేవిూ లేదని ఎద్దేవా చేశారు. రైతులను పొగిడినట్టే పొగిడి నిండా ముంచారని, బడ్జెట్‌ ఒట్టి డొల్ల అని, అన్ని వర్గాలను మోసం చేసిందని కెసిఆర్‌ తీవ్ర స్థాయిలో విమర్శించారు, కథ చెప్పారు తప్ప..బడ్జెట్‌ పెట్టినట్టు అనిపించలేదు. పేదల కోసం ఒక్క పాలసీ అయినా ప్రకటించారా? బడ్జెట్‌లో ఒక పద్దు.. పద్ధతి లేదు. బడ్జెట్‌పై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని కెసిఆర్‌ అన్నారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఆయన తొలిసారి అసెంబ్లీకి హాజరయ్యారు. కెసిఆర్‌ ఎప్పుడు వొస్తారా అని ఎదురుచూస్తున్న వారి ఉత్కంఠకు తెరదించుతూ ఆయన గురువారం బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన సందర్భంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. బడ్జెట్‌ ప్రసంగం తరవాత అసెంబ్లీ విూడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ…బిఆర్‌ఎస్‌ హయాంలో తాము రెండు పంటలకు రైతుబంధు ఇచ్చామని, కాంగ్రెస్‌ ప్రభుత్వం దీన్ని ఎగ్గొడతామని చెబుతుందని విమర్శించారు.

తాము రైతులకిచ్చిన డబ్బును దుర్వినియోగం చేసినట్లు ఆరోపిస్తున్నారని, ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వమని తెలుస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు చేయలేదని, విద్యుత్‌, నీటి సరఫరా, గొర్రెల పంపిణీ లేదని, రైతు భరోసా గురించి ప్రస్తావనే లేదని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులు, వృత్తి కార్మికులను వంచించిందని, రాష్ట్ర బడ్జెట్‌ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని కెసిఆర్‌ విమర్శించారు. ఇది పేదల, రైతు బడ్జెట్‌ కాదని అన్నారు. ప్రభుత్వానికి ఒక విధానమంటూ లేదన్నారు. కథ చెప్పారు తప్ప..బడ్జెట్‌ పెట్టినట్టు అనిపించలేదన్నారు. రైతు భరోసాలో అనేక ఆంక్షలు పెడుతున్నట్టు చెప్పారని, ఈ ఈ ప్రభుత్వం ప్రజల గొంతు కోసిందని అన్నారు. దళిత బంధు పథకం ప్రస్తావనే లేదని, దళితులంటే ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఇదేనా అని, గొర్రెల పెంపకం పథకానికి తూట్లు పొడిచారని కెసిఆర్‌ దుయ్యబట్టారు. యాదవులు, మత్స్యకారులను ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చాం. ఈ ప్రభుత్వానికి పాలసీ లేదని అర్థమైంది. ఐటీ, పారిశ్రామిక పాలసీ ఏది? ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం ప్రకటించలేదు‘ అని కేసీఆర్‌ విమర్శించారు.

ఈ బడ్జెట్‌ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. . రైతులను పొగిడినట్లే పొగిడి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. తాము ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. మత్స్యకారులకు భరోసా లేదని గొర్రెల పంపిణీ పథకాన్ని పూర్తిగా మూసివేసినట్లు కనిపిస్తోందని అన్నారు. దళిత బంధు  ప్రస్తావన లేదని తెలిపారు.  ఒక్క కొత్త పథకం ప్రవేశపెట్టలేదని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయ, పరిశ్రమల సంగతి ఏంటని ప్రశ్నించారు. రైతులను వృత్తికార్మికులను ప్రభుత్వం వంచించిందని  మాజీ సీఎం కేసీఆర్‌ విమర్శించారు. ఆయారంగాల అభివృద్ధికి ఏం చర్యలు తీసుకుంటున్నారో విధివిధానాలు లేవన్నారు. ఉన్న పథకాలను మూసివేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. ఓడిన తర్వాత.. ప్రతిపక్ష నేత హోదాలో బ్జడెట్‌ సమావేశానికి హాజరైన కేసీఆర్‌.. విూడియా పాయింట్‌ వద్ద కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడి..తాను చెప్పాలనుకున్నది చెప్పి వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page