తప్పు చేస్తే ఎంతటివారైనా శిక్షార్హులే

– భగీరథ్ విషయంలో వెనకడుగు లేదు : మంత్రి సీతక్క
మహబూబాబాద్, మే13 : భగీరథ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా తాత్సారం చేయలేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కారణంగా కేసు నమోదు చేయడంలో ఒక్క రోజు ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనని మంత్రి సీతక్క ఒప్ప్పుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన కేసు వివాదంపై మంత్రి సీతక్క స్పందించారు. కేంద్ర మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా తప్ప్పు చేస్తే శిక్ష పడాల్సిందేనన్నారు. ఈ కేసులో ‘సిట’ ఏర్పాటు కాలయాపన కోసం కాదని, నిజానిజాలు వెలికితీయడానికేనని పేర్కొన్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు మహిళలను గౌరవించాలని, ప్రజలను ప్రేమించాలని సీతక్క సూచించారు.
——————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *