కార్మికులకు అన్యాయం జరిగింది: మాజీ మంత్రి హరీష్ రావు
సింగరేణి కార్మికులకు ఇచ్చే లాభాల్లో తెలంగాణ ప్రభుత్వం కోత విధించడంపై మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. మొత్తం రూ.4,701 కోట్ల లాభంలో 33శాతం బోనస్‌గా ప్రకటించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందన్నారు. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పారని విమర్శించారు.‘లాభాల వాటాల్లో 50శాతం కోత విధిస్తూ కార్మికులకు చేసిన అన్యాయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది.
రూ.4,701 కోట్ల లాభాలు చూపించి, కేవలం రూ.2,412 కోట్లలో 33 శాతం బోనస్‌ను ప్రకటించడం వెనక ఆంతర్యమేంటి? ఆల్‌టైం రికార్డు ఉత్పత్తిని సాధించినా, గతం కంటే ఒక్కో కార్మికుడికి అదనంగా ఇచ్చేది రూ.20 వేలేనా? కార్మికులు చేసిన కష్టానికి, ఫలితం ఇవ్వకపోవడం దారుణం. రాష్ట్రం ఏర్పడిన తొలి సంవత్సరం (2014-15) లోనే సింగరేణి లాభాల నుంచి కార్మికులకు 21 శాతం వాటాను నాటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. సమైక్య రాష్ట్రంలో కార్మికులకు జరిగిన అన్యాయం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోంది‘ అని హరీష్‌రావు అన్నారు.