– కెటిఆర్ సవాల్‌కు మంత్రి పొంగులేటి ప్రతిసవాల్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25: సొంత చెల్లి, బావ ఫోన్‌లు కూడా ట్యాప్ చేసిన కేటీఆర్‌కు ఇందిరమ్మ పేరు పలికే అర్హత కూడా లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇండ్లపై కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు. అధికారంలోకి వచ్చిన తొలి రెండున్నర సంవత్సరాల్లోనే రాష్ట్రంలో 4.5 లక్షల ఇండ్లు నిర్మిస్తున్నామన్నారు. ఇందిరమ్మ పాలన అంటే ఏంటో గ్రామాల్లోకి వెళ్లి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న కుటుంబాలను అడిగితే తెలుస్తుందని కేటీఆర్‌కు హితవు పలికారు. ఫామ్‌హౌస్‌లలో ఉంటే ఏం తెలుస్తుందన్నారు. జూన్ 1న మరో 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నామని, ఈ మేరకు నిన్నటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించామని చెప్పారు. రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్న డ్రామారావు గారు.. అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొట్టి, లోక్‌సభ ఎన్నికల్లో మికు సున్నా సీట్లు ఇచ్చి, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాల్లో కూడా మిమ్మల్ని ఓడగొట్టిన ప్రజలంతా వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు సున్నా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. మిరు ప్రత్యేకంగా రాజకీయ సన్యాసం తీసుకోనక్కర్లేదంటూ ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగదు.. డబుల్ బెడ్ రూం ఇండ్లు లేని గ్రామాల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఓట్లు అడగకూడదు.. సవాల్‌కు సిద్ధమేనా అని కేటీఆర్‌కు పొంగులేటి పిలునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



