– 30శాతం కూడా ధాన్యం సేకరించని కేంద్రం
– రాష్ట్రంలో విద్యారంగం పటిష్టతకు కఠిన చర్యలు
– లెఫ్ట్ నేతలతో భేటీలో సీఎం రేవంత్
– కార్మికుల కనీస వేతనం పెంచడంపై ‘లెఫ్ట్ ’ అభినందన
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25 : కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు పెంచడమే తప్ప పంటలను కొనుగోలు చేయడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. కనీసం 30 శాతం ధాన్యం కూడా సేకరించడం లేదన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో సీపీఎం, సీపీఐ బృందాలు వేర్వేరుగా సీఎంతో సమావేశమయ్యాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో ఆయా పార్టీ నేతలు సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. సుదీర్ఘ కాలం పెండింగ్‌లో ఉన్న కార్మికుల కనీస వేతనాల పెంచుతూ నిర్ణయం తీసుకోవడంపై ఆ నేతలు సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, మÖసీ ప్రక్షాళన, విద్యారంగ అంశాలపైనా వారి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కారణంగా హమాలీలు తమ స్వస్థలాలకు వెళ్లడంతో ఇక్కడ కొరత ఏర్పడిందన్నారు. మరోవైపు ఎండల తీవ్రత కారణంగా మధ్యాహ్నం సమయంలో పని జరగడం లేదని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై నిరంతరం సవిÖక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మొక్కజొన్న దిగుబడి బాగా వచ్చిందంటూ తమ ప్రభుత్వానికి నష్టం వచ్చినా మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. మÖసీ నిర్వాసితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, స్థానికంగానే నివాసాలు మంజూరు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయంలో పార్టీలు రాజకీయం చేయడం తగదన్నారు. మÖసీని పునరుజ్జీవం చేసి అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మÖసీ కాలుష్యం నల్గొండ జిల్లా ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారిందంటూ అక్కడ ఎదురవుతున్న పరిస్థితులను వివరించారు. ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేస్తున్నామని సీఎం చెప్పారు. విద్యా రంగంలో చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా వారికి వివరించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెబుతూ రంగారెడ్డి జిల్లా ఆరుట్ల పాఠశాలను ఒకసారి సందర్శించాలని సీపీఎం నేతలను రేవంత్ కోరారు. నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, దానిలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, భోజనం అందిస్తున్నామని తెలిపారు. సీఎంను కలిసిన వారిలో లెఫ్ట్ పార్టీల నేతలతోపాటు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



