– నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు చూపితే రాజకీయ సన్యాసం
– సీఎం రేవంత్ ఓ గజదొంగ
– పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కూకట్ పల్లి, ప్రజాతంత్ర, మే 25 : వచ్చే ఎన్నికల్లో ముమ్మాటికి గులాబీ ప్రభుత్వమే అధికారంలోకి రానుందని బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. కూకట్ పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో సోమవారం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. మనసున్న సీఎం కేసీఆర్ పేదలు 80 గజా లలో అనుమతులు లేకుండానే ఇల్లు నిర్మిం చుకునేందుకు అవకాశం కల్పించారన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరుతో పేద ల ఇల్లు కూలుస్తూ పేదలను రోడ్డున పడే స్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలవికాని 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను గోస పెడుతోందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం రూపాయికే నల్ల కలెక్షన్ ఇచ్చి 20 వేల లీటర్లు నీరు అందించిందని, 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చి ప్రజలను ఆదుకుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని, తాము అధి కారంలోకి వచ్చిన తర్వాత వీటన్నింటి తిరిగి ప్రజలకు అందిస్తామని తెలిపారు. కరోనా తర్వాత నగరంలో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి, 24 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించామని, నగరంలో నాలుగు దిక్కుల వెయ్యి పడకల ఆసుపత్రులు నిర్మించామని తెలిపారు. కెసిఆర్ ప్రభు త్వం నిర్వహించిన భవనాలను, ఫ్లై ఓవర్లను, ఆసుపత్రులను రేవంత్ ప్రారంభోత్సవాలు మాత్రమే చేసి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వంలో మంచినీ టి సమస్య పరిష్కారంతోపాటు రహదారులు, మెట్రో, ఫ్లై ఓవర్లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టామని, రియల్ ఎస్టేట్ ద్వారా అందరి సంపద పెరిగిందన్నారు. గుంపు మేస్త్రి పాలనలో రియల్ ఎస్టేట్ కుదేలైందని, గ్యారంటీ కార్డులు పట్టుకుని అధికా రంలోకి వచ్చిన కాంగ్రెస్ కొంపలు ముంచుతుందని అన్నారు. గృహ నిర్మాణ రంగంలోని కార్మికులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజలను దోచుకునేందుకు దండుపాలెం గజదొంగల బ్యాచ్ కు రేవంత్ రెడ్డి నాయకుడిగా మారాడని దుయ్యబట్టారు.
పార్టీ బలోపేతానికి జూన్ లో సభ్యత్వ నమోదు తో పాటు నూతన కమిటీల ఏర్పాటు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. 60 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నిబద్ధత కలిగిన సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు ప్రజల చుట్టూ తిరిగే నాయకులకే వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో సర్వేల ఆధారంగా టికెట్లు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. పదేళ్ల పాలనలో అభివృద్ధి కోసం కృషి చేశామని, రానున్న రోజుల్లో కార్యకర్తలను ఉద్యమ నాయకులను కాపా డుకుంటామన్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుందని ఇందుకు బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హుడైన ఒక్కరి ఓటు కూడా పోకుండా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. బీహార్లో 65 లక్షలు, బెంగాల్లో 90 లక్షల ఓట్లు తొలగించడం జరిగిందని, తెలంగాణలో ఈ పరిస్థితి తలెత్తకూడదని అన్నారు. ఆ రెండు రాష్ట్రాలలో కొద్ది ఓట్ల తేడాతోనే ఫలితాలు తారుమారైనవని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ సతీష్ అరోరా, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



