- డబుల్ ఇళ్ల నిర్మాణమే ఇందుకు సాక్ష్యం
- ఎక్స్ వేదికగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్27: ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకుపోతోంది. ఇప్పటికే కొన్ని వందల నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. అనేక మందికి నోటీసులు కూడా ఇచ్చారు. తాజాగా మూసి పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కన్నేసింది. గోల్నాక, చాదర్‌ఘాట్, మూసారంబాగ్.. మూసి ఆక్రమణల కూల్చివేతలకు రంగం సిద్ధమైంది.ఈ క్రమంలో 1,350 మందికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఎప్టీఎల్, బఫర్ జోన్‌లో ఇళ్లను హైడ్రా మార్క్ చేసింది. అయితే హైడ్రా కూల్చివేతలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. హైడ్రా టార్గెగా మాజీ మంత్రి విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ విష ప్రచారాలు అబద్దాలు అనడానికి మరో సాక్షం ఇదే అంటూ పేర్కొన్నారు. మేము నిర్మిస్తే – రు కూల్చేస్తున్నారు.. మాది నిర్మాణం – ది విధ్వంసం.. లక్షల నిర్మాణాలు మావి – లక్షల కూల్చివేతలు వి. మూసి నది సాక్షిగా ఇదిగిదిగో మహానగరంలో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు. కాంగ్రెస్ విష ప్రచారాలు అబద్దాలు అనడానికి మరో సాక్షం ఇదే. కట్టలేదన్నారు – ప్రజలను మభ్యపెట్టాం అన్నారు – మరి లక్ష ఇండ్లు రాత్రికి రాత్రికి ఎక్కడ నుంచి పుట్టుకొచ్చాయి చిట్టి.. పాలనలో అధికారులే టేబుల్ ముందు పెట్టిన డబుల్ లెక్కలు చూసి మతిపోతుందా.. కేసీఆర్ నిజం, అయన హాలు నిజం ఆయన మాట నిజం అని తెలిసి మింగుడుపడటం లేదా. జూటా మాటలు, కుట్రలకు, దిమాక్ తక్కువ పనుల డ్యామేజ్ కంట్రోల్‌కు ఇవ్వాళా కేసీఆర్ నిర్మాణాలే దిక్కయ్యాయి. కేసీఆర్ లక్ష డబుల్ నిర్మాణాలు నిజం – కేటాయింపులు నిజం. నాలుకలు తాటి మట్టాలు కాకుంటే ఇంకోసారి అబద్దాలు మాట్లాడకండి‘ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.