– మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ, ప్రజాతంత్ర, జూన్ 13: రైతన్నల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుందని, గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని పేర్కొన్నారు. నల్గొండలో రాష్ట్ర సిట్రస్ సెమినార్ – 2026ను రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో కలసి మంత్రి కోమటిరెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నల్గొండ జిల్లా పేరు చెప్పగానే బత్తాయి తోటలు గుర్తుకు వస్తాయన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా వేలాదిమంది రైతుల జీవనాధారంగా బత్తాయి సాగు చేస్తున్నారని తెలిపారు. తాను రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినని చెప్పారు. గతంలో స్వయంగా బత్తాయి సాగు చేసిన అనుభవం తనకు ఉందని వివరించారు. గత సంవత్సరం వరకు బత్తాయి రైతులకు ప్రత్యేకంగా ఓ వేదిక లేకపోవడం లోటుగా ఉండేదనన్నారు. పుస్తకాల్లో ఉండే శాస్త్రీయ జ్ఞానం రైతుల పొలాల వరకు చేరినప్పుడే వ్యవసాయ రంగంలో నిజమైన మార్పు వస్తుందని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


