సిరిసిల్ల ‘మన బడి-మన బాధ్యత’లో బండి

– ఎస్పీ గైర్హాజ‌రుపై మంత్రి ఆగ్రహం

రాజన్న సిరిసిల్ల,ప్రజాతంత్ర,జూన్‌13: ‌కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ‌కుమార్‌  ‌సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్‌ ‌బి. గీతేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ‘మన బడి-మన బాధ్యత’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేశ్‌ ‌బి. గీతే హాజరు కాకపోవడంపై బండి సంజయ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మాత్రమే ఉండటంతో.. ’ఎస్పీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తాను సాధారణ కార్యకర్తను కాదని, కేంద్రమంత్రిగా పాల్గొంటున్న కార్యక్రమానికి జిల్లా పోలీసు అధికారి హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ’ ఎస్పీకి బీఆర్‌ఎస్‌పై అంత ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. అవసరమైతే బీఆర్‌ఎస్‌లో చేరాలని వ్యంగ్యంగా అన్నారు. అధికార యంత్రాంగం రాజకీయ పక్షపాతం లేకుండా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు అధికారులు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని బండి సంజయ్‌ ఆదేశించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *