1948 సెప్టెంబర్ 17న పూర్వం తెలంగాణలో ప్రజల జీవన స్థితిగతులు సామాజిక రాజకీయాంశాలు యూనియన్ సైన్యం ప్రవేశం తదనంతర పరిణామాలను పరిశీలిస్తేనే సెప్టెంబర్ 17 తెలంగాణలో ప్రజలకు విమోచనమా ! విలీనమా !! విద్రోహమా !!! తెలిసేది. ఎవరు ఓడారు ఎవరు గెలిచారు తెలిసేది. .! పటేల్ పట్వారీ జమీందార్ దేశముఖ్ నిజాంల దురాగతాలకు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాల్లో పేదలు లక్షలాది ఎకరాల భూముల్ని ఆక్రమించుకున్నారు శిస్తుల పేరుతో దోచుకునే రాక్షస పాలనకు చరమగీతం పాడారు మూడువేల గ్రామాల్లో గ్రామరాజ్యాల్ని నిర్మించుకున్నారు. గడీల్ని కోటల్ని కూల్చుతున్న ఆ ప్రజాశక్తి దానికి తట్టుకోలేక దొరలు పటేళ్ళ పట్వారీలు దేశ్‌ముఖాలు జమీందార్లు ఊళ్ళు విడిచిపారిపోయారు. భూమి భుక్తి కోసం ప్రారంభమైన అణగారిన ప్రజల ఉద్యమం చివరి రాజ్యాధికార సాధన దిశగా పయనిస్తోంది. ఈ పరిణామాలన్నీ ఒక్కరోజుల్లో సంభవించినవి కావు. ఎందరో వీరుల త్యాగాలతో బలిదానాలతో సంవత్సరాల పాటు పోరాడిన పీడిత ప్రజల విజయం అది విజయం.
“అగ్ని కిలలందు ఎగసి
ఆహాః రహమూ పోరాడిన
మృతవీరుల కొన్నెత్తుడి
తడిసిన జయకేతనమును
పగతో పరపర కోరికే
పందికొక్క మందలు”
అంటూ విశ్వవిఖ్యాత స్పానిష్ కవి పాబ్లో నెరూడ కలం నుంచి జాలువారిన ఆవేదనాభరితమైన కవిత ఇది. నాడు చీలిలో ప్రజాస్వామ్యాన్ని హరిస్తూ తన సహచరుల్ని అంతమొందించిన సామ్రాజ్యవాదం అమెరికా ఏజెంట్లను సైనిక నియంతలను దునుమాడుతూ రాసిన ఈ కవిత 1948 సెప్టెంబర్ 17 సైనిక చర్య విమోచనం, విలీనం పేరుతో తెలంగాణ ప్రజల చరిత్రకు వక్రభాష్యాలు చెబుతున్న వారికి అక్షరాలా సరిపోతుంది. వర్గ సమాజంలో ఒక విషయం పట్ల ఏకాభిపాయం ఉండదు. తమ వర్గ ప్రయోజనాల్ని ప్రతిపాదికగా తీసుకొని విషయాన్ని విశ్లేషించడమే పరిపాటిగా ఒక విషయాన్ని భిన్నవర్గాలు విభిన్నకోణాల్లో పరిశీలిస్తూ విభిన్నంగా విశ్లేషస్తూ భిన్నమైన భాషలు చెప్పడం చరిత్రలో కోకొల్లలు. ఒక్కో సందర్భంలో తమ ప్రయోజనాల కోసం చిన్న చిన్న సంఘటనల్ని తమకు అనుగుణంగా మలుచుకునేందుకు వాటిని పెద్దవి చేసి చూపడం అతిశయోక్షులు ప్రదర్శించకండి. మన మెరిగిన వాస్తవాల్ని మరుగుపరిచి అవాస్తవాల్ని చరిత్రను మలిచిన ప్రబుద్దులూ చరిత్రలో లేకపోలేదు. విగ్రహాలు ప్రతిష్టంచడం వివిధ సంస్థలకు నామకరణంతో ఈ వర్గ ప్రయోజనాలన్నీ కళ్ళరా ఇప్పడు చూస్తున్నాం. ఎవరెన్ని భాష్యాలు చెప్పినా స్వార్థపూరిత వాదాలన్ని దూది పింజల్లా ఎగిరిపోతాయి. వాస్తవాన్ని ఆవిష్కరించే వాదమే నిలిచి వెలుగుతుంది. ఇది చారిత్రక సత్యం.
హైదరాబాద్ సంస్థానాల్లోకి యూనియన్ సైన్యాలు ప్రవేశించడం తదనంతర పరిణామాలను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా విశ్లేషస్తూ విమర్శలు ప్రతి విమర్శలకు దిగుతున్నారు. ఈ విమర్శలు మహోన్నతమైన తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర పట్ల అవగాహన లేనివాళ్ళను మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్లును గందరగోళపరుస్తున్నాయి. దీనివల్ల ఉమ్మడి శత్రువు ప్రయోజనం నెరవేరే ప్రమాదమూ లేకపోలేదు. 1948 సెప్టెంబర్ 17న పూర్వం తెలంగాణలో ప్రజల జీవన స్థితిగతులు సామాజిక రాజకీయాంశాలు యూనియన్ సైన్యం ప్రవేశం తదనంతర పరిణామాలను పరిశీలిస్తేనే సెప్టెంబర్ 17 తెలంగాణలో ప్రజలకు విమోచనమా ! విలీనమా !! విద్రోహమా !!! తెలిసేది. ఎవరు ఓడారు ఎవరు గెలిచారు తెలిసేది. .!
పటేల్ పట్వారీ జమీందార్ దేశముఖ్ నిజాంల దురాగతాలకు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాల్లో పేదలు లక్షలాది ఎకరాల భూముల్ని ఆక్రమించుకున్నారు శిస్తుల పేరుతో దోచుకునే రాక్షస పాలనకు చరమగీతం పాడారు మూడువేల గ్రామాల్లో గ్రామరాజ్యాల్ని నిర్మించుకున్నారు. గడీల్ని కోటల్ని కూల్చుతున్న ఆ ప్రజాశక్తి దానికి తట్టుకోలేక దొరలు పటేళ్ళ పట్వారీలు దేశ్‌ముఖాలు జమీందార్లు ఊళ్ళు విడిచిపారిపోయారు. భూమి భుక్తి కోసం ప్రారంభమైన అణగారిన ప్రజల ఉద్యమం చివరి రాజ్యాధికార సాధన దిశగా పయనిస్తోంది. ఈ పరిణామాలన్నీ ఒక్కరోజుల్లో సంభవించినవి కావు. ఎందరో వీరుల త్యాగాలతో బలిదానాలతో సంవత్సరాల పాటు పోరాడిన పీడిత ప్రజల విజయం అది విజయం. నైజాం సైన్యలు పోలీసులు రజాకార్లను ఎదిరించి నిలిచిన మహోద్యమానికి నైజాం నవాబు బెంబేలెత్తి బ్రిటిష్ వారి కనుసన్నల్లో భారత ప్రభుత్వంతో యథాతధ ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం తెలంగాణలో యూనియన్ సైన్యం ప్రవేశించడం గ్రామాల్లో కమ్యూనిస్టులపై నిర్బంధం అణచివేత హత్యలు అత్యాచారాలు యథేచ్ఛగా సాగాయి.
సెప్టెంబర్ 17 ఈ పరిణామాలన్నింటికి నాంది పలికిన రోజు. ఆరోజు నిరసనగా పాటించాలని కొందరు.. వేడుకలు జరుపుకోవాలని మరికొందరు.. ప్రజలకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17 విలీనమా ! విమోచనా !! విద్రోహామా !!! అనే సందేహం కోట్లాది మెదళ్లును తెలుస్తున్న ప్రశ్న. సెప్టెంబర్ 17 విజయం ఎవరిదనే చర్చ. తరువాత ఆ యుద్ధంలో ఓడిందెవరో తేల్చడం చర్చ ఒకరిని గెలిపించడం మరొకర్ని ఓడించడం యుద్దం సహజ లక్షణం.. యుద్ధంలో ఒకరు గెలవాలంటే ఎవరో ఒకరు ఓడాలి. ఒక్కోసారి యుద్ధం ఇరువురిని ఓడిస్తుంది. సెప్టెంబర్ 17 విజయం వెనుక ఓడిందెవ్వరు? తెలంగాణ సాయుధ పోరాటంలో ఓడిందెవ్వరు ? ఏ విషయాన్నైనా వర్గ ప్రయోజనంతోనే చూడాలి. తెలంగాణ పోరాటానికి కూడా అదే కోణంలో పరిశీలించాలి. యుద్దానంతరం ఆశించిన ప్రయోజనాలు ఎవరు పొందుతురో వారే గెలిచినట్లు. ఎవరైతే భంగపడతారో వారి ఓడినట్టు. అదే కదా అని మన చరిత్ర పాఠాల్లో చదివిన సత్యం. యూనియన్ సైన్యాలు ప్రవేశానంతరం రాబందుల్లాంటి దొరలు, పటేళ్లు, పట్వారీలు, జమీందార్లు మళ్లీ గ్రామాల్లోకి ప్రవేశించారు.
కూలిపోయిన కోటల్ని తిరిగి నిలిపారు. కత్తుల వంతెనపై కవాతు చేసి నైజాం సైన్యాలను తరిమిన వీరయోధుల్ని వెతికి చంపారు. ఊళ్ళకి ఊళ్లోనే తగలబెట్టి తెలంగాణను రావణకాష్టంలా రగిల్చారు. పోరాడి సాధించుకున్న భూములన్నీ మళ్లీ దొరల చేజిక్కింది. యూనియన్ సైన్యాలు జమిందారులు దొరలు, పటేళ్లు వేలాది మంది ఉద్యమకారుల్ని, ప్రజల్ని హత్య చేశారు అత్యాచారాలకు పూనుకున్నారు. ఇది నిన్నటి చరిత్ర. ఎవరు గెలిచారు. ఎవరు ఓడారు. ఎవరు విముక్తి సాధించారు.. ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి. భూమి కోల్పోయిన ప్రజలా ? పేదల భూమిని లాక్కున్న దొరలా ? దిల్లీ పటేలు ఎవరిని ఓడించి గెలిచారు ? నైజామును ఓడించారా? పటేళ్లను, జమీందార్లను ఓడించి గెలిచారా ? అణగారిన ప్రజల్ని ఓడించి గెలిచారు. ? తెలంగాణ ప్రజలు గెలిచారా ? ఎవరిపై గెలిచారు ? దొరలపైనా? జమీందార్లపైనా? నైజాంపైనా ? ఎలా గెలిచారు? భూములు దక్కించుకున్న వాళ్ళు గెలిచారా ? భూమిని పోగొట్టుకున్న వాళ్ళు గెలిచారా ? దిల్లీ పెద్దలతో విధుల్లో పాల్గొని ఖుషిగా యథాతధ ఒప్పందం చేసుకొని ఏడాదికి లక్షల రూపాయల రాజభరణం, పరిహారం పొంది జల్సా చేసిన నైజాం గెలిచాడు. పోతూ పోతూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని మూటగట్టుకుని పోయాడు. నిజాం నైజాం గెలిచాడు. కమ్యూనిస్టు ఉద్యమకారుల ముట్టడి నుంచి నైజాం విముక్తుడుయ్యాడు. నైజాం నవాబుకు నిజాంగా అది విముక్తి దినమే..
ఊళ్ళు వదిలి పారిపోయిన నైజాం అనుచరులు మళ్లీ ఊళ్లకు వచ్చి పేదల భూముల్ని లాక్కొని ప్రజలపై కసితీరా అకృత్యాలకు పాల్పడ్డారు. దున్నేవాడిదే భూమంటూ పేదలందర్నీ కూడగట్టుకొచ్చిన ఉద్యమం అడ్డు తగిలింది. దొరలకు, జమీందారులకు, పట్టేళ్లకు అది నిజంగా విముక్తి దీనమే. వాళ్ల ప్రయోజనాలు నెరవేర్చిన సెప్టెంబర్ 17 వారికి విముక్తి దినం కాక మరేంమవుతుంది. సాయుధ పోరాట ఉద్యమం ప్రయోజనాలను కోల్పోయిన వారికి అది నిజంగా ఓటమే. త్యాగాలతో సాధించుకున్న రాజ్యాన్ని చేజారించుకున్న రోజది. చేతికొచ్చిన భూమిని చేజారిస్తున్న తెలంగాణ బిడ్డలకది నిరసన దినమే. అది దొరల మీద తిరగబడ్డ తెలంగాణ పీడిత ప్రజలందరి ఓటమి. దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా చాటింపేసిన మాదిగ డప్పు, చాకలి ఐలమ్మ ఓడిపోయింది. ఐలమ్మ లాంటి వీరమాతలు వాళ్ళబిడ్డలు ఓడిపోయారు.
బంధగీ ఓడిపోయాడు. దొడ్డి కొమరయ్య ఓడిపోయాడు. కుళ్లబొడిచినా స్థావరం జాడచెప్పని పసివాడు ఓడిపోయాడు. బండి యాదగిరి పాట ఎత్తుకొని బందూకు పట్టుకొని బయలుదేరిన మట్టి మనుషులు ఓడిపోయారు. బిడ్డల్ని వదిలి అజ్ఞాతం వెళ్ళిన తల్లులు తల్లి రొమ్ముకు దూరమైన పిల్లలు ఓడిపోయారు. రెడ్డి హాస్టల్ విద్యార్థి రాం రెడ్డి ఓడిపోయాడు. షోయబుల్లా ఖాన్ ఓడిపోయాడు. ఓడిపోయిన వాళ్లకు వాళ్ల వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వాళ్లకు సెప్టెంబర్ 17 నిరసన దినమే. ద్రోహం జరిగిన రోజు విద్రోహ దినం కారణమైంది. ఒక్క అడుగు వెనకకు.. రెండు అడుగులు ముందుకు.. అదే తెలంగాణ సాయుధ పోరాటంలో ఎర్రజెండాలు చెప్పిన చారిత్రక పాఠం. తెలంగాణ సాయుధ పోరాటం చావలేదు. కవచంలో బీజం లాగా నిద్రాణమై ఉంది. ఇప్పడది చిగురిస్తున్న ఆశ పాయలు పాయలుగా బయలుదేరిన చైతన్య ప్రవాహాలన్నీ ఒక్కటె ఒడ్డులు ఒరుసుకుంటూ గాంభీరంగా ప్రవహిస్తున్న జీవనది.
శోభరమేష్,
8978656327,
కాకతీయ విశ్వవిద్యాలయం