ఏపీలో బీజేపీ జనసేన టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టే తెలంగాణలో మోదీ బాబు పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో పొత్తుతో ఎన్నికల్లో నాటికి బలమైన శక్తిగా వస్తామని మోదీ తెలంగాణ పర్యటనతో పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.తెలంగాణలో ఇంత వరకూ బీజేపీ, జనసేన, టీడీపీ పోత్తు లేదని పరోక్షంగా చెప్పిన మోదీ తాజా పర్యటన, ఎన్డీయే మిత్రపక్షాలతో భేటీల గమనిస్తే వచ్చే గ్రేటర్ హైదరాబాద్ తో పాటు భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లో కూటమిగానే పోటీ చేస్తామని, తెలంగాణలోని టీడీపీ బీజేపీ,జనసేన శ్రేణులకు మోదీ ఇన్ డైరెక్ట్ సంకేతాలు ఇచ్చారు. తెలంగాణలో బాబు పవన్ తో కలిసే పోటీ చేస్తామని చెప్పే ప్రయత్నం మోదీ చేశారు.
ఏడాది పాటు బంగారం కొనవద్దు, విదేశాలకు వెళ్లొద్దు, వంట నూనెలు, ఎరువుల దిగుమతి తగ్గించుకోవాలి, రసాయనాల వాడకం తగ్గించుకోవాలి. పశ్చిమాసియాలో యుద్ద జరుగుతున్న పెట్రో డిజిల్ పెంచలేదు. ఇది పరెడ్ గ్రౌండ్‌లో ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలను, బీజేపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు. అయితే మోదీ ప్రసంగంపై తెలంగాణ ప్రజలే కాదు సొంత పార్టీ నేతలే ముఖం విరుస్తున్నారు. ఇలాంటి విషయాలు చెప్పడానికి దిల్లీ నుంచి తెలంగాణ దాకా వచ్చారా మోదీ గారు అంటున్నారు.
తెలంగాణకు కేంద్రం ఏం ఇస్తుందో చెప్పకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి పాలన వైఫల్యాలపై కనీసం స్పందించకుండా, సర్కార్ తప్పులను ప్రశ్నించకుండా, తెలంగాణలోని వాటర్ ప్రాజెక్టులపై, విభజన సమస్యలపై ప్రశ్నించకుండా, ప్రభుత్వంలోని అవినీతి, బంధుప్రీతి, క్విడ్ ప్రో ఆరోపణలపై స్పందించకుండా ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. ఇది ఒక వ్యూహాత్మక దాటవేతనే.
.అయితే ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో రెండు కీలక విషయాలు స్పష్టంగా కనిపించాయి. ఒకటి రాష్ట్రంలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని అధికారికంగా తన కలవాలని, కలిస్తే ఎక్కడికో తీసుకెళతామనని ప్రకటించడం. ఇది చూడటానికి హాస్యంగా, వ్యంగ్యంగా కనిపించిన మోదీ మాటల వెనుక రాజకీయ దూరదృష్టి, బలమైన ఎత్తుగడ వ్యూహాత్మక కారణం కూడా ఉంది.
అటు రేవంత్ రెడ్డి అన్యాపదేశంగానే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గుజరాత్ రాష్ట్రానికి, బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు ఇవ్వలేదని ప్రధాని మోదీ వ్యంగ్యంగా చెప్పిన అది కాంగ్రెస్ పార్టీని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ,యూపీఏ పాలనపై రేవంత్ రెడ్డి మరోసారి మోదీ నోటితో చెప్పించారు.మన్మోహన్ సింగ్ నిజాయితీపరుడు, మేధావి, నిష్పక్షపాతి అనేక సందర్భాల్లో దేశాన్ని సంక్షోభం నుంచి పీవీ నరసింహ రావు నుంచి యూపీఏ-2 వరకూ కాపాడారనే పేరుంది.తెలంగాణ విభజనపై కీలకపాత్ర పోషించారు.తెలంగాణ ఉద్యమంపై సానుకూలంగా ఉండేవారు. పరేడ్ గ్రౌండ్‌లో ఆ మన్మోహన్ సింగ్‌పై మోదీ చేత రేవంత్ రెడ్డి విమర్శలు చేసే పరిస్థితి ఉద్దేశ్య పూర్వంగానే కలిపించినట్లుంది.
అంతేకాదు ప్రధాని మోదీ చాలా స్పష్టంగా తమతో ఉంటే గుజరాత్ కు పదేళ్ళలో ఎన్ని నిధులు ఇచ్చామో అన్ని నిధులు తెలంగాణకు ఇస్తామని ప్రకటించారు. ఇది ఒక రకంగా దేశ ఫెడరల్ స్పూర్తికి విరుద్దం. దేశంలో రాష్ట్రాలన్నీంటిని సమానంగా చూడాలన్న రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకం. అంతేకాదు ఏకంగా ఒక ప్రతిపక్ష ముఖ్యమంత్రిని ఓపెన్‌గానే ప్రలోభాలకు గురిచి చేసి కోనుగోలు చేయడమే అవుతుంది. ప్రధాని మోదీ మాటల్లో బయటికి వ్యంగ్యం కనిపించిన ఆ వ్యంగ్యం వెనుక లోతైన వ్యూహం కనిపిస్తుంది. మోదీ బాహాటంగానే తమతో ఉంటే నిధులే కాదు, రాజకీయ భవిష్యత్తు కూడా బాగుంటుందని, కాంగ్రెస్ లో కంటే గొప్ప అవకాశం ఇస్తూ, గొప్ప స్థాయికి తీసుకువెళ్తానని ప్రధాని చెప్పారు. ఇది బహిరంగంగా వాషింగ్ పౌడర్ నిర్మామే స్కీమే.
ఓపెన్ ఫిరాయింపును ప్రధాని స్థాయిలో ప్రోత్సహించడమే అవుతోంది.ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమే. దేశ ప్రధానిగా దేశంలో అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూడటం లేదని మోదీ మాటల్లో కనిపిస్తుంది. మోదీ మాటలకు సీఎం రేవంత్ నవ్వుతూ చప్పట్లు కొట్టారు తప్ప కనీసం ఒక వ్యతిరేక ముఖ ఎక్స్ ప్రెషన్ కూడా ఇవ్వలేదు. ఇది మోదీ రేవంత్ రెడ్డి మధ్య రహస్య బంధాన్ని మరింత పటిష్టం పర్చుతుంది. ఎప్పటి నుంచో చీకట్లో ఉన్న రేవంత్ మోదీ బంధం ఇవాళ మరోసారి హెచ్ ఐసీసీ వేదికగా బయటపడింది.
ఇక రెండో అంశం పరెడ్ గ్రౌండ్ లో ప్రధాని మోదీ చేసిన ప్రసంగం.వాస్తవానికి ఏ మాటకామాట చెప్పుకుంటే మోదీ సభకు చాలా మందే వచ్చారు. జనసమీకరణ బాగానే జరిగింది. అయితే మోదీ ప్రసంగం మాత్రం కార్యకర్తలను నిరుత్సాహపరిచింది. ప్రధాని తన దైన శైలిలో హావభావాలతో మోదీ మార్క్ స్టైల్ లో ప్రసంగం చేసిన ఎందుకో తెలంగాణ ప్రజలను ఆకట్టుకోలేక పోయింది. ఒక రకంగా ఆపరేషన్ సక్సెస్ పెషెంట్ డైడ్ లా ఉంది. అంతేకాదు మోదీ ప్రసంగంలో పస లేదు, పదును కనిపించలేదు. టీ బీజేపీ క్యాడర్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. మోదీ సభ ప్రాంగణానికి రాకముందు టీ బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం పై, రేవంత్ విధానాలను విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో అవినీతి, బంధుప్రీతి క్విడ్ ప్రో పెరిగిందని కిషన్ రెడ్డి వంటి నేతలు ఘాటుగా విమర్శలు గుప్పించారు.
ఇక ప్రధాని మోదీ ప్రసంగం మాత్రం టీ బీజేపీ నేతలు ప్రసంగాలకు పూర్తి భిన్నంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పై కనీసం విమర్శలు కూడా చేయలేదు. రేవంత్ రెడ్డి సర్కారు అద్భుతంగా ఉందనే సంకేతాలు క్యాడర్ కు పంపించారు. ప్రభుత్వ వైఫల్యాలను టచ్ కూడా చేయలేదు. ఒక రకంగా తెలంగాణలో మోదీ పర్యటన రేవంత్ రెడ్డి పై , కాంగ్రెస్ ప్రభుత్వం పై వస్తున్న విమర్శల నుంచి ప్రజల దృష్టిని మరల్చడమే కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి బంధుప్రీతి క్విడ్ ప్రో జరుగలేదు అని చెప్పే ప్రయత్నం చేశారు.గత పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో ట్రిపుల్ ఆర్ టాక్సి నడుస్తుందని, 30% పాలన నడుస్తుంది రేవంత్ రెడ్డి సర్కారుపై ప్రధాని విమర్శలు చేశారు.ఆర్ ఆర్ టాక్సీ అంటూ ఆరోపణలు చేశారు.
ఇంకోవైపు తెలంగాణలో మోదీ పర్యటన చాలా వ్యూహాత్మకంగా, హిడెన్ ఎజెండాతో సాగింది. తెలంగాణలో పాగా వేసేందుకు పక్క పతాక రచన తో సాగింది. రాష్ట్రంలో మోదీ టూర్ ఒక స్ట్రాటజీ అయితే, హైదరాబాద్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో విడివిడిగా మోదీ భేటీ కావడం ఒక పొలిటికల్ స్ట్రాటజీ.
ఏపీలో బీజేపీ జనసేన టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టే తెలంగాణలో మోదీ బాబు పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో పొత్తుతో ఎన్నికల్లో నాటికి బలమైన శక్తిగా వస్తామని మోదీ తెలంగాణ పర్యటనతో పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.తెలంగాణలో ఇంత వరకూ బీజేపీ, జనసేన, టీడీపీ పోత్తు లేదని పరోక్షంగా చెప్పిన మోదీ తాజా పర్యటన, ఎన్డీయే మిత్రపక్షాలతో భేటీల గమనిస్తే వచ్చే గ్రేటర్ హైదరాబాద్ తో పాటు భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లో కూటమిగానే పోటీ చేస్తామని, తెలంగాణలోని టీడీపీ బీజేపీ,జనసేన శ్రేణులకు మోదీ ఇన్ డైరెక్ట్ సంకేతాలు ఇచ్చారు.తెలంగాణలో బాబు పవన్ తో కలిసే పోటీ చేస్తామని చెప్పే ప్రయత్నం మోదీ చేశారు.
మరోవైపు మోదీ హెచ్ఐసీసీ నుంచి పరెడ్ గ్రైండ్ కు వచ్చే సరికి ప్రధాని ప్రసంగమే మారి పోయింది. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించారు.పరెడ్ గ్రైండ్ సభ కు ముందు చంద్రబాబు మోదీ కలిసారు. చంద్రబాబు కావాలనుకుంటే దిల్లీలో మోదీ ని కలవచ్చు. విత్ ఔట్ అపాయింట్ తో మోదీ ని కలిసే అవకాశం, మోదీ కి అవసరం కూడా ఉంది. అలాంటి చంద్రబాబు ను మోదీ తెలంగాణలో అందులో హైదరాబాద్ లో కలవడం రాష్ట్ర రాజకీయాల్లో మార్పులకు సంకేతం. తెలంగాణలో ఉన్న టీడీపీ బీజేపీ వోటర్లను, క్యాడర్స్, శ్రేణులను కన్సాలిడేటెడ్ చేయడంలో భాగంగా మోదీ ఎంచుకున్న పొలిటికల్ వ్యూహం.
అందుకే తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న చంద్రబాబుతో మోదీ గంటకు పైగా సమావేశం అయ్యారు.. సుదీర్ఘంగా తెలంగాణలో టీఆర్ఎస్, కవిత పార్టీ తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం పై వస్తున్న వ్యతిరేకత, రేవంత్ రెడ్డి వైఫల్యాలపై చంద్రబాబు మోదీ సుదీర్ఘంగా చర్చించారు. అందుకే జూబ్లీహిల్స్ నుంచి పరెడ్ గ్రైండ్ కు మోదీ చేరుకునే సరికి ప్రధాని స్పీచ్ మారిపోయింది.
వాస్తవానికి తెలంగాణలో చంద్రబాబు షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ లో , రేవంత్ రెడ్డి చుట్టూ చంద్రబాబు తన మనుషులున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో చీమ చిటుక్కుమన్నా ఏపీలో చంద్రబాబు కు తెలిసిపోతుంది. రేవంత్ రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయం అక్కడ నుంచే ఆదేశాలు అందాల్సిందే. రేవంత్ రెడ్డి జుట్టు చంద్రబాబు చేతిలో ఉంటే.చంద్రబాబు రేవంత్ రెడ్డి జుట్టు మోదీ చేతిలో ఉంది.
ఇంకోవైపు తెలంగాణలో పర్యటనలో మోదీ చాలా క్యాటగారికల్ గా వ్యవహరించారు. నిజానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. అయితే ప్రధాని స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మోదీ విమర్శలు, ఆరోపణలు చేస్తే ప్రజల్లో అసంతృప్తి మరింత పెరుగుతుంది. ఆ పెరిగిన అసంతృప్తి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి వోటు బ్యాంకుగా మారే అవకాశాలు లేవు.
బండి సంజయ్ కొడుకు వివాదం, నేతల మధ్య అనైక్యత, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులపై దాడి, రేవంత్ రెడ్డితో టీ బీజేపీ నేతల రహస్య బంధాలు తెలంగాణ ప్రజలకు అర్థమయ్యాయి. కాంగ్రెస్ బీజేపీలు ఎంపీలు తెలంగాణకు ఏమీ చేయలేదని, వెరసి దిల్లీ బాస్ లకు బానిసలుగా మారారు. తెలంగాణ అస్తిత్వం,ఆత్మగౌరవం ఆత్మాభిమానంపై కాంగ్రెస్ బీజేపీలు దాడి చేస్తుంటే మౌనంగా ఉంటున్నారు. పార్లమెంట్ సాక్షిగా దాడి జరుగుతున్న చీము నెత్తురు లేని అసమర్థతను ప్రదర్శిస్తున్నారు.
ఇలాంటి టైంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై, రేవంత్ రెడ్డి బంధు ప్రీతి పాలన, క్విడ్ ప్రో పై విమర్శలు చేస్తే ప్రజల అసంతృప్తి ఆటో మేటిగ్ గా బీఆర్ఎస్ వోటు బ్యాంకు గా మారుతుంది. బీఆర్ఎస్ మరింత ప్రజల్లో పాతుకుపోతుంది. అది రేవంత్ రెడ్డికి, బీజేపీకి నష్టం చేస్తుంది.
.ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది.. ఇప్పుడే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అది బీఆర్ఎస్ కే లాభం చేస్తుంది.అందుకే ఇవాళ మోదీ కాంగ్రెస్ ప్రభుత్వం పై , రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే ప్రయత్నం చేయలేదు.. అంతేకాదు మోదీ కాంగ్రెస్ పార్టీపై గాంధీ కుటుంబంపై విమర్శలు చేశారు కానీ, సీఎం రేవంత్ రెడ్డిపై ఒక్క విమర్శ కూడా చేయలేదు..ఇది కూడా మోదీ వ్యూహాంలో భాగమే.
ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే వచ్చే రెండున్నర ఏళ్ళలో వ్యతిరేకత మరింతగా పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో బలహీన పడుతాడు.పార్టీపై ,నేతలపై పట్టు కోల్పోతారు..అది బీజేపికీ మరింత ప్రమాదం.. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఎంత బలంగా ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లోపు బీజేపీకి అంతబలం. రేవంత్ రెడ్డి బలంగా ఉంటేనే అతని మాట నేతలు వింటారు..తన పాటు బీజేపీలో చేరుతారు. అప్పుడు బీజేపీ వ్యూహాలు సక్సెస్ అవుతుందని మోదీ , బీజేపీ స్ట్రాటజీ.
.తెలంగాణలో మోదీ పర్యటన ఒక స్ట్రాటజీ ప్రకారం జరిగింది. చంద్రబాబును పవన్ కళ్యాణ్ తో భేటీ, రేవంత్ రెడ్డికి మోదీ తనతో కలిసి రావాలని ఓపెన్ గా పిలవడం.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా పోటి చేస్తామని సంకేతాలు పంపడం. గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ గద్దెలు కూల్చాలని రేవంత్ రెడ్డి టీడీపీ కార్యకర్తలకు పిలుపునివ్వడం.రేవంత్ రెడ్డి అసమర్థత వల్ల చంద్రబాబు తెలంగాణకు షాడో సీఎం గా పనిచేస్తుండం. ఇదంతా తెలంగాణ పాగా వేసేందుకు మోదీ చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిసి ఆడుతున్న పొలిటికల్ గేమ్.
అయితే పరెడ్ గ్రౌండ్‌లో ప్రధాని మోదీ ప్రసంగం చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. కాంగ్రెస్ కూడా అలర్ట్ కావాలి.రాజకీయాల్లో నేతల మధ్య పార్టీల మధ్య ఏదీ కూడా బహిరంగ రహస్యం కాదు. అన్నీ చీకటి ఒప్పందాలే. పదేపదే మోదీ బెంగాల్ ,అసొం ప్రస్తావన ఎందుకు తీసుకున్నారు. రేవంత్ రెడ్డిని కలిసి రావాలని ఎందుకు ఓపెన్‌గానే ఆహ్వానించారో అర్థం చేసుకోవాలి.
.బెంగాల్, అసొంలో విపక్ష పార్టీలను చీల్చి అందులో బలమైన నేతలకు బీజేపీ వాషింగ్ పౌడర్ నిర్మా స్కీమ్ పెట్టి పార్టీలో చేర్చుకుంది. బెంగాల్ టీఎంసీలో సువేందు అధికారి, అసోం కాంగ్రెస్‌లో హిమంత బిశ్వ శర్మలు కట్టర్ బీజేపీ నేతలు కాదు, కాంగ్రెస్ టీఎంసీఎలోని బలమైన నేతలు. వారిని పార్టీలో చేర్చుకుని ఇవాళా బెంగాల్‌లో టీఎంసీని, అసోంలో కాంగ్రెస్‌ను బీజేపీ రాజకీయ సమాధి చేసింది.
ఇప్పుడు ఒక సువెందు, ఒక హేమంత బిశ్వశర్మలాగా తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డిని బీజేపీ చూస్తుంది.ఆ మేరకు ఎంకరేజ్ చేస్తుంది. అందుకే ఓపెన్‌గానే ప్రధాని అఫర్ ఇస్తున్నారు. అయితే బెంగాల్, అస్సాంలో అధికారంలోకి వచ్చామని,అటు పంజాబ్‌లో రాఘవ చద్దాలో ఆప్‌ను గుప్పిట్లో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో పంజాబ్‌లో కూడా పాగా వేస్తామని మోదీ వ్యూహత్మకంగా చెపుతున్నారు.
అదే విధంగా తెలంగాణ కూడా మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీజేపీ రాజకీయ ఎత్తుగడలు వేస్తుంది. అందు కోసం రేవంత్ రెడ్డి అప్పటిదాకా కాంగ్రెస్‌లో బలమైన నేతగా ఉండాలి.అతని వెంట కనీసం 30 మంది ఎమ్మెల్యేలు ఉండాలి అప్పుడే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చీల్చి బీజేపీ గద్దెనెక్కడం సాధ్యం అవుతుంది. అందుకే మోదీ రేవంత్ రెడ్డిపై కనీసం చిన్న విమర్శ కూడా చేయలేదు.ముందు కాంగ్రెస్‌కు కమ్యూనిస్టులను,పౌర సమాజాన్ని దూరం చేసి తర్వాత బుదుగరించో, బెదిరించో ఇప్పుడున్న అధికార కాంగ్రెస్ పక్ష నాయకులను తనకనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. బెంగాల్‌లో అసోంలో ఆప్‌లో శివసేన, ఎన్సీపీలో ఇదే వ్యూహాన్ని బీజేపీ అమలు చేసింది.మిగతా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల్లాగా కాకుండా తెలంగాణ ప్రాంతీయ పార్టీలు అప్రమత్తంగా ఉండాలి.
ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా అలర్ట్‌గా ఉండాలి. బెంగాల్ దీదీ, అసోంలో కాంగ్రెస్ నిర్లక్ష్యంగా ఉండటంతో ఇవాళ ఫలితాన్ని అనుభవిస్తుంది..అందుకే తెలంగాణలో రేవంత్ పట్ల ఏఐసీసీ నిత్యం జాగురతలో ఉండాలి. ఇది ఒక్క కాంగ్రెస్ పార్టీకే వర్తించదు.బీఆర్ఎస్ పార్టీ కూడా అప్రమత్తంగా ఉండాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వన్ సైడ్ విక్టరీ సాధించకపోతే ఏ మాత్రం ఫలితాలు అటు ఇటు వచ్చిన బీఆర్ఎస్ మళ్లీ ప్రతిపక్షంలోనే కూర్చోవలసి వస్తుంది. ఒకసారి బీజేపీ కింగ్ మేకర్ అయితే అది బీఆర్ఎస్ పార్టీకి కూడా నష్టం చేస్తుంది.
-తోటకూర రమేష్





