కుల గ‌ణ‌న‌పై దొంగల మాటలను నమ్మొద్దు..

  • బిఆర్ఎస్ చేప‌ట్టిన సమగ్ర సర్వే వివరాల‌ను ఎందుకు దాచారు?
  • ఈనెల 19 తర్వాత కొత్త వరంగల్ చూడబోతున్నాం…
  • వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి

హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, నవంబ‌ర్ 10 :  కుల‌గ‌ణ‌న‌పై ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా కొంద‌రు దొంగ‌లు చెబుతున్న మాట‌ల‌ను ఎవ‌రూ న‌మ్మొద్ద‌ని వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి అన్నారు.  ప్రభుత్వ స్థలాన్ని క‌బ్జా చేసి భవనం కట్టుకుని కనీసం పన్ను కట్టలేని కార్యాలయంలో కేటీఆర్‌ కూర్చొని ప్రభుత్వాన్ని నిందిస్తున్నార‌ని నాయిని ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఆదివారం హనుమకొండ డీసీసీ భవన్ లో జ‌రిగిన‌ మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడారు.  మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి కేటీఆర్ బయలుదేరార‌ని, ఉన్నత చదువులు అని చెప్పుకునే కేటీఆర్ భాష చూస్తేనే  ఆయ‌న‌ సంస్కారం ఎంటో తెలుస్తుంద‌ని విమ‌ర్శించారు. అధికారం పోయినా కూడా ఆయ‌న‌ భాష, యాస మారలేదన్నారు. 10 ఏళ్లలో ప్రళయాలు సృష్టిస్తే 1 0నెలలుగా ప్రక్షాళ‌న చేస్తున్నామ‌న్నారు. ఉప ఎన్నికల కోసం హుజూరాబాద్ లో దళితబంధు ఇచ్చి మిగిలిన నియోజకవర్గాలకు మొంచి చేయి చూపార‌ని ఆరోపించారు. దళిత బంధు పథకాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఎందుకు అమలు చేయలేద‌ని ప్ర‌శ్నించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే నటనకు ఆస్కార్ తప్పకుండా ఇవ్వాల‌ని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ పార్టీ భవనానికి ఇంటి పన్ను కడుతున్నారా? ఆ పార్టీ కార్యాలయ నిర్మాణ అనుమతులు ఉన్నాయా..? అని ప్ర‌శ్నించారు.  తెలంగాణ పునర్నిణంలో భాగంగా మూసీ నదికి పునరుర్జీవ‌నం తెస్తున్న ప్రభుత్వంపై అవాకులు చేయడం హేయమ‌ని అన్నారు. తప్పకుండా బుల్డోజర్లతో గడీలను, ఫార్మ్ హౌస్ లను కూలగొడతామ‌ని, గతంలో వరంగల్ జిల్లాకు ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని నెరవేర్చార‌ని ప్ర‌శ్నించారు. ఉద్యమ కాలంలో నీ ఇంట్లో ఎంత మంది మరణించారు.

దేశ వీదేశాల్లో ఉన్న వాళ్ళను రప్పించి చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఎందుకు ప్రజలకు చూపించడం లేదు. దళితులకు ఇస్తానన్న మూడు ఎకరాల భూమి ఏమైంది, కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమయింది, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాన‌న్న మాట ఏమైంద‌ని నిల‌దీశారు. పట్టుమని ఏడాది కాకముందే ప్రభుత్వంపై అక్కసుతో విషపూరిత పదజాలాలు ఉపయోగిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప్రజలు ప్రశ్నిస్తారు, ప్రతిపక్షం అడిగే స్వేచ్ఛ లేదా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న కేటీఆర్..  మరీ ధర్నా చౌక్ ఎందుకు ఎత్తేసినవ్ అని అడిగారు.  కులాల వారీగా లెక్కలు చెప్పే అర్హత కేటీఆర్ కు లేద‌న్నారు.  గొర్రెల పంపిణీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌లో అవినీతి జ‌రిగింద‌ని అన్నారు. కులగణన సర్వేతో అన్ని కులాలకు సమన్యాయం, రాజకీయంగా సమూచిత స్థానం, ఆర్థిక, సామజిక లబ్ది చేకూర్చాలని ప్రభుత్వం చూస్తోంద‌ని అన్నారు. కులగణన పట్ల మేధావి వర్గం ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తుంద‌ని అన్నారు.  బిఆర్ఎస్ మాటలకూ విలువలిచ్చే రోజులు లేవ‌న్నారు.
ఈ నెల 19వ‌ తేదీ తరువాత సమగ్ర ఆధారాలతో అభివృద్ధి అంశాలపై మీడియా ముఖంగా వెల్లడిస్తాన‌ని,మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మీ అభివృద్ధి పై వివరణ ఇవ్వండ‌ని స‌వాల్ విసిరారు. త‌మ‌  ప్రభుత్వ ఆధ్వర్యంలో మామూనూరు విమానాశ్రయానికి రెక్కలు వొచ్చాయి, అండర్ డ్రైనేజ్ పనులకు డీపీఆర్‌  సిద్ధమైంది. కాజిపేట బ్రిడ్జి పనులను వేగవంతం చేస్తున్నామ‌న్నారు.  నాలుగు కలలపాటు సమగ్రభివృద్ధి జరగాలన్నా, సమస్యలు పరిష్కారం కావాలన్నా బిఆర్ఎస్ నాయకుల మాటలను నమ్మవద్దని నాయిని రాజేంద‌ర్ రెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆనంద్, పులి అనిల్, కార్పొరేటర్లు జక్కుల రవీందర్, విజయశ్రీ రాజాలి, పోతుల శ్రీమాన్, మామిండ్ల రాజు మాజీ కార్పొరేటర్లు అబూబాకర్,బోడ డిన్న, మాదవి రెడ్డి, నాసిమ్ జహాన్, ఏనుకొంటి నాగరాజు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని లక్ష్మా రెడ్డి, రాంప్రసాద్, లీగల్ సెల్ నాయకులు తోట రాజ్ కుమార్, నాయకులు మహ్మద్ అంకుస్, రంగనాథ్, కొడిపాక గణేష్, గుంటి స్వప్న, తౌటం రవీందర్, రఘుపల్ రెడ్డి, నల్ల సత్యనారాయణ, సుగుణాకర్ రెడ్డి, మేరీ, రహీమున్నీసా, కుమార్ యాదవ్, ఇప్ప శ్రీకాంత్, జాఫర్, రవి ప్రసాద్ డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page