హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమితులైన సివి ఆనంద్ సిఎం రేవంత్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిశారు. అయితే బాధ్యతలు తీసుకునేముందు కలియడం విశేషం. ఇటీవలే ఆయన కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆనంద్ ఇంతకాలం ఎసిబి డిజిగా ఉన్నారు. ఆయన గతంలోనూ హైదరాబాద్ సిపిగా పని చేశారు.
పదేళ్ల పాటు ప్రజాస్వామ్యాన్ని చెరపట్టి ఇప్పుడు నీతులా..
ఫిరాయింపులపై హరీష్ మాటలు హాస్యాస్పదం
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ విమర్శ
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి హరీష్ రావు సుద్దపూస కబుర్లు చెబుతున్నారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపణలు చేశారు. తెలంగాణలో పదేళ్ల పాటు ప్రజాస్వామ్యాన్ని చెరపట్టి ఇప్పుడు బీఆర్‌ఎస్ నాయకులు నీతులు బోధిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన మామా అల్లుళ్లు ఇప్పుడు వేమన శతకాలు వల్లెవేస్తున్నారని అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా బేరసారాలు చేసిన హరీష్ రావుకు ఇప్పుడు రాజ్యాంగం గుర్తుకు వొచ్చిందా అంటూ ప్రశ్నించారు. విపక్ష శాసనసభ్యుల ఇళ్లకు వెళ్లి ప్రలోభాలు పెట్టి, బెదిరించి చేర్చుకున్న రోజులను హరీష్ రావు మర్చిపోయినట్లున్నారని మండిపడ్డారు.

రాజ్ భవన్‌లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు రాజ్యాంగ స్పూర్తి ఎటు పోయిందని లక్ష్మణ్ ప్రశ్నించారు. అప్రజాస్వామ్యం అంటు ఇప్పుడు గగ్గోలు పెడుతున్న హరీష్‌రావు…ఆయన మామ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంటే ఏం చేశాడని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల గొంతులు పిసుకుతుంటే చప్పట్లు కొట్టింది హరీష్ రావు కాదా…అంటూ ప్రశ్నించారు. ప్రజాసంఘాలను కేసీఆర్ ఖతం చేస్తుంటే పక్క నుంచి ఆయన చేసిన భజన ఎవరికి తెలియదనుకుంటున్నవాంటూ ఘాటుగా విమర్శించారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తుంటే వెకిలి నవ్వులు నవ్వింది హరీష్ రావు కాదా అని ప్రశ్నిస్తూ…సిగ్గు , లజ్జా లేకుండా పార్టీ ఫిరాయింపుల గురించి, కోర్టు తీర్పుల గురించి మాట్లాడుతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయనకు ఆత్మసాక్షి ఉందా..అని, వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లు హరీష్‌రావు, బీఆర్‌ఎస్ నేతల తీరు ఉందని అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. ఉప ఎన్నికలు వొస్తాయని హరీష్‌రావు ఆనందపడుతున్నారని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా ఆయనకుకు, ఆయన మామకు సిగ్గు రాలేదా..అని ప్రశ్నిస్తూ.. మళ్లీ ఉప ఎన్నికలు కావాలా….అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు మరోసారి కర్రు కాల్చి వాత పెడతరు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వొచ్చినా కాంగ్రెస్‌కే జనం జేజేలు కొడతారని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులపైన హైకోర్టు తీర్పును తాము గౌరవిస్తామని, స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.