డీజీపీ కార్యాలయంలో వీల్ చైర్ ర్యాంప్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30: రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం (డీజీపీ ఆఫీస్)కు వచ్చే దివ్యాంగుల సౌకర్యార్థం ఆల్ ఇండియా డిసేబుల్డ్ రైట్స్ ఫోరమ్ అధ్యక్షుడు చేసిన విజ్ఞప్తి మేరకు డీజీపీ సి.వి.ఆనంద్ ‘వీల్ చైర్ ర్యాంప్ ఏర్పాటు చేయించారు. ఫోరం అధ్యక్షులడు కొల్లి నాగేశ్వరరావు ఇటీవల డీజీపీని కలిసి కార్యాలయానికి వచ్చే దివ్యాంగుల కోసం వీల్ చైర్ ర్యాంప్ ను ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. ర్యాంప్ లేకపోవడం వల్ల వీల్ చైర్లపై వచ్చే దివ్యాంగులు ఉన్నతాధికారులను కలవడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు.
దివ్యాంగుల సమస్యపై సానుకూలంగా స్పందించిన డీజీపీ ఆనంద్ వెంటనే కార్యాలయంలో వీల్ చైర్ ర్యాంప్ నిర్మించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ మేరకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. కార్యాలయంలోని స్టాఫ్ లిఫ్ట్ సమీపంలో దివ్యాంగులకు అనుకూలంగా ఉండేలా వీల్ చైర్ ర్యాంప్‌ను నిర్మించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *