మరిన్ని పెట్టుబడులు పెట్టండి..
ఫాక్స్ కాన్ చైర్మన్‌కు సీఎం రేవంత్ రెడ్డి భరోసా..
కొంగరకలాన్‌లో కంపెనీని సందర్శించిన సీఎం రేవంత్
ఫాక్స్ కాన్ చైర్మన్‌కు సీఎం రేవంత్ రెడ్డి భరోసా..
కొంగరకలాన్‌లో కంపెనీని సందర్శించిన సీఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : కొంగరకలాన్ ఫాక్స్ కాన్ కంపెనీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సోమావరం సందర్శించారు. ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈసందర్భంగా కంపెనీ పురోగతి, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఫాక్స్ కాన్ చైర్మన్ యాంగ్ లియూ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రేవంత్ రెడ్డి మాట్లాడారు. కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదని భరోసా ఇచ్చారు. మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు. ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఫాక్స్ కాన్ కంపెనీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.