క్రీడా, యువజన వారోత్సవాలు ప్రారంభం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా యువజన క్రీడా వారోత్సవాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్‌లో జరిగిన జుంబా కార్యక్రమంలో క్రీడలు, యువజనుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లు పాల్గొని జ్యోతి వెలిగించారు. అనంత‌రం 5 కిలోమీటర్ల వాకథాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, మల్‌రెడ్డి రాంరెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోని బాలాదేవి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈనెల 23వ తేదీ వరకు ఈ వారోత్సవాలు జరుగుతాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *