ఈఏపీసెట్ లో ఎంజేపీ విద్యార్థుల హవా  

– 516 ర్యాంక్ సాధించిన హర్షిణి
– అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 5వేల లోపు ర్యాంకులు
– ఇంజనీరింగ్‌లో 10వేల లోపు ర్యాంకులు
– విద్యార్థులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం అభినందన
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే1 8 : మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ విద్యార్థులు ఈఏపీసెట్-2026 ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నత విద్యా కోర్సుల కోసం నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలో 3781మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. వీరిలో ఐదు వేల లోపు ర్యాంక్ 46మంది విద్యార్థులు, పది వేల లోపు ర్యాంక్ 178 మంది విద్యార్థులు సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో హర్షిణి (516వ ర్యాంక్), కల్పిత (1315 ర్యాంక్), కె.శ్రవణ్ కుమార్ (1377 ర్యాంక్), టి.నవ్య(1692 ర్యాంక్) అత్యుత్తమ ర్యాంక్ సాధించగా ఇంజినీరింగ్ విభాగంలో బి.అనిరుధ్ (3513 ర్యాంక్), జి.వినోద్ కుమార్ (3568 ర్యాంక్ ), ఎన్.రుషిక్ వర్మ (4433 ర్యాంక్) సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో మొత్తం 1626మంది ఎంజేపీ¾ విద్యార్థులు క్వాలిఫై కాగా వీరిలో ఐదు వేల లోపు ర్యాంక్ సాధించిన వారు 43మంది విద్యార్థులు, పది వేల లోపు ర్యాంక్ సాధించిన వారు 122మంది ఉన్నారు. 20వేల లోపు ర్యాంక్ 247 మంది, 40000లోపు ర్యాంక్‌ను 703 మంది విద్యార్థులు సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో 2155 మంది విద్యార్థులు క్వాలిఫై కాగా వారిలో 5000లోపు ర్యాంక్ ముగ్గురు, 10వేల లోపు ర్యాంక్ 56 మంది, 20వేల లోపు ర్యాంక్ 167మంది విద్యార్థులు, 40వేలలోపు ర్యాంక్ 412 మంది విద్యార్థులు సాధించారు. అర్హత సాధించిన విద్యార్థులను, బోధన సిబ్బందిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్య కార్యదర్శి బాల మాయాదేవి, ఎంజేపీ¾ కార్యదర్శి బడుగు సైదులు అభినందించారు. ఈ ఫలితాలు బీసీ గురుకుల విద్యాసంస్థల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, ప్రత్యేక శిక్షణ, క్రమశిక్షణకు నిదర్శనంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ప్రభుత్వం గురుకుల విద్యా వ్యవస్థను బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మౌలిక వసతులు మెరుగుపరిచామని, ప్రత్యేక ఆన్‌లైన్ కోచింగ్ ద్వారా విద్యార్థులకు అవసరమైన పోటీ పరీక్షల శిక్షణ అందిస్తున్నామని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా రెండు కాలేజీ ఆఫ్ ఎక్సలెన్స్ మాత్రమే ఉండగా గత ఏడాది కొత్తగా పది సీవోఈలు, ఈ ఏడాది మరో పది సీవోఈలు ఏర్పాటు చేశామన్నారు. వచ్చే ఏడాది మరింత ఎక్కువ సంఖ్యలో బీసీ గురుకుల విద్యార్థులు ఉన్నత విద్యా కోర్సులకు శిక్షణ తీసుకుని అత్యుత్తమమైన ఫలితాలు సాధిస్తారని ఆయన ఆకాంక్షించారు.
——————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *