రాష్ట్రంలో 11 నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
•ధాన్యం కొనే దిక్కులేక రైతుల అవస్థలు• దళారులతో మిల్లర్లు కుమ్మక్కు..
•సంస్థాగతంగా బిజెపి బలోపేతం చేయాలి •ప్రజల సమస్యలపై ఎక్కడికక్కడ పోరాటాలు
•పార్టీ కార్యశాలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7: రాష్ట్రంలో 11 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వొచ్చిందని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారని, ఆరు గ్యారెంటీల అమలులో విఫలమయ్యారన్నారు. సంస్థాగతంగా బీజేపీను బలోపేతం చేసుకోవాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన అధ్యక్షతన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై కార్యశాల నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు, రిటర్నింగ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు దివాలా తీశాయని చెప్పారు. భాజపాకు సంస్థాగత ఎన్నికల వ్యవస్థ ఊపిరి అని చెప్పారు.
ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలన్నారు. మహిళ, యువత, రైతుల సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. సంస్థాగత ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతుంది.. ఈ నెల 15 వరకు సభ్యత్వ సేకరణ కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నేటితో మెంబర్ షిప్ డ్రైవ్ చివరి దశకు చేరుకుంది. బూత్ , మండల, జిల్లా కమిటీ ల ఎన్నికలపై మార్గనిర్దేశం చేసేందుకు సిద్దమైంది బీజేపీ. బూత్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ పై చర్చ నిర్వహిస్తున్నారు ఈ నెల 15 నుంచి 25 వరకు బూత్ కమిటీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర , జిల్లా రిటర్నింగ్ అధికారుల నియామకం జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణలో బీజేపీ సభ్యత్వం సుమారు 31 లక్షలు దాటిందని అంచనా వేస్తున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బిజెపి ప్రపంచం లోనే అతి పెద్ద పార్టీ బీజేపీ అని కిషన్ రెడ్డి తెలిపారు. రెగ్యులర్ గా సంస్థాగత ఎన్నికల నిర్వహించుకుంటున్న పార్టీ బీజేపీ అని తెలిపారు. తెలంగాణలో సుమారు 35 లక్షలు చేరుకుందన్నారు. ఈ నెల 15 వరకు సభ్యత్వ సేకరణ కొనసాగుతుందన్నారు. వివిధ స్థాయిల్లో బీజేపీ కమిటీల్లో 30శాతం కొత్త వారికి అవకాశం ఇచ్చారని తెలిపారు. బూత్ నుంచి జాతీయ స్థాయి వరకు సమర్ధులైన వారితో కమిటీ వేసినట్లు వెల్లడించారు. బీజేపీలో కొత్త వారిని చేర్పించాలని, భాగస్వామ్యులను చేయాలన్నారు. ఇతర పార్టీల్లో ఏ జరుగుతుంది తెలుసు. కుటుంబాల ఆధారంగా నడిచే పార్టీలు అవి. ఆ పార్టీలకు తరువాత ప్రెసిడెంట్ అవుతారో ముందే చెప్పొచ్చని తెలిపారు.
బీజేపీ మాత్రం ప్రజాస్వామ్యంగా ముందుకు వెళ్తుంది? ఎవరైనా పార్టీ లో అధ్యక్షులు కావొచ్చన్నారు. ఇకపోతే తెలంగాణ పరిస్థితి పెనం నుండి పొయ్యి లో పడ్డట్టు అయిందన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చి ఏడాది అవుతుంది. ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదని మండిపడ్డారు. అప్పులు మాత్రం విపరీతంగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన పోరాటం చేయాలని కిషన్ రెడ్డి తెలిపారు. ఒక వైపు సంస్థాగత అంశాల పై దృష్టి పెడుతూనే.. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలన్నారు. ప్రజలకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలు కి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లు, మధ్య దళారులతో కుమ్మక్కు అయ్యి రైతులకు నష్టం కలిగిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పనులు మాత్రం జరగడం లేదన్నారు. ఇక్కడ ఇచ్చిన హామీలు అమలు చేసినట్టు మహారాష్ట్రలో దుర్మార్గంగా ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు