Take a fresh look at your lifestyle.

కొట్టుకు చచ్చేది..!!

చూడు ‘హస్తం’ ‘కమలం’ భేటీ
‘కారు’ విసిరే పొలిటికల్‌  ‘‌లాఠీ’
పార్టీల ‘తేనేతుట్టే’ కదిలింది
‘స్వార్ద’ రాజకీయం భగ్గుమంది
గుట్టు ‘చప్పుడు’ వినపడింది

హుజురాబాద్‌ ‌లో ‘కుస్తీ’
హైదరాబాద్‌ ‌లో  ‘దోస్తీ’
రాజేందర్‌, ‌రేవంత్‌ ‌రెడ్డి భాయి భాయి
ఆ పార్టీల కేడర్‌ ‌ప్రచారంలో గాయిగాయి
‘కేటిఆర్‌’ ‌వదిలాడు బాణం

హెలికాప్టర్‌ ‌ఢిల్లీకి పంపిండంట
మంత్రి కిషన్‌ ‌రెడ్డిని రప్పించిండంట
‘ఈటల’ కు కాషాయరంగేసిండంట
‘కేసీఆర్‌’ ‌పై కాంగ్రెస్‌ ‌తిరుగు బాణం

‘‘వాళ్ళు..వాళ్ళు…ఒక్కటేనోయి
కొట్టుకు చచ్చేది కార్యకర్త లేనోయి’’!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర

Leave a Reply