సమస్యల సుడిగుండంలో కాకతీయ విద్యార్థుల చదువులు…!?

విశ్వవిద్యాలయాలు భావి భారత పౌరులను ఉన్నంతగా తీర్చిదిద్దే కేంద్రాలు
సమాజంలోని అభివృద్ధికర మార్పులకు పురుడు పోసే ప్రదేశాలు!  

అవినీతి అరాచకత్వం మూఢనమ్మకాలు బాల్య వివాహాలు వంటి సాంఘిక రుగ్మతలను ఓడిరచేసే శిక్షణ కేంద్రాలు. ఇటువంటి నేపథ్యం కలిగిన విశ్వవిద్యాలయాలు ఆ విద్యాలయ విద్యార్థులు నేడు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. సమాజ మార్పు కోసం సత్యశోధన చేయవలసిన విద్యార్థిరత్నలు విశ్వవిద్యాలయలలో సైతం తలదాచుకోవడానికి కాసింత స్థలం కోసం నెలల తరబడి ఎదురుచూడవల్సిన దుస్థితికి నెట్టివేయబడుతున్నారు.
రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వివిధ జిల్లాలలోని విద్యార్థులు తమ కనీస అవసరాలు అయిన తరగతి గదులు, మంచినీటి వసతి, స్కాలర్‌ షిష్స, మెస్‌ చార్జిలు, బెంచ్‌ లు, బ్లాక్బోర్డ్లు, వసతి గృహాలు వంటి అనేక సమస్యలతో నిరంతరం ఆందోళనలో మునిగి తేలుతున్నారు వాటిని పరిష్కరించడంలో జాష్యం చేస్తున్న అధికారులు పాలకులు ఈ సమస్యలు తీవ్రమై వర్సిటీ స్థాయిలో విజృంభిస్తుంటే చూసి చూడనట్టు వదిలేస్తున్నారు విశ్వవిద్యాలయంలో సైతం మౌలిక వసతులు సాంకేతిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించడంలో యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండటం విద్యార్థుల భవిష్యత్తు పట్లఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

అద్భుతమైన సౌకర్యాల రూపకల్పనకు అవకాశం కలిగి వుండి విశాలమైన సదుపాయాలు చారిత్రక భవన నిర్మాణం కలిగిన కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో రెండో రాజధానిగా పిలవబడుతుంది ఎన్నో ఉద్యమాలకు నిలయమైన ఓరుగల్లులో వున్న కాకతీయ విశ్వవిద్యాలయం నేడు సమస్యలకు అసౌకర్యాలకూ అవినీతికి చిరునామంగా మారింది వందలాది మంది విద్యార్థినీలు వుండే మహిళావసతి గృహలు మొదలు వందలాది మంది విద్యార్థులు వుండే బాయ్స్‌ హాస్టల్‌ నుండి యూనివర్సిటీ విద్యార్థుల విద్యా కేంద్రమైన కళాశాలలు సైతం సమస్యలకు అడ్డాగా మారిపోతున్నాయి వేలాది మంది విద్యార్థినీలు వుండే మహిళా వసతి గృహలు విష పురుగులు దోమలు ఈగలు కుక్కలువంటి జీవులు పెంపుడు శాలలుగా మారిపోతున్న దుస్థితి నెలకొన్నది మరోపక్క హాస్టల్‌ లోని కామన్‌ మెస్‌ లలో విద్యార్థులకు ఆహారపదార్థాలు సరిపడ అందక మెస్‌ మెను అమలు చేయడంలో జాష్యం చేస్తూ పరిశుభ్రత వంటి విషయాలు విస్మరించి పౌష్టిక ఆహారం కూడా అందించక పోవడం సాధారణ విషయంగా మారిపోయింది ఇటువంటి సమస్యలను పదుల సార్లు రిజిస్టర్‌ ఉపకులవతుల దృష్టికి తీసుకెళ్లడం తాను నిర్వర్తించవల్సిన బాధ్యతను గుర్తిస్తున్నట్లు పోజు పెట్టి ఆచరణలో పరిష్కరించుక పోవటం షరామామూలు అయిపోయింది ఈ విధంగా యూనివర్సిటీ అధికారుల నిర్లిప్తతకు సజీవ సాక్ష్యాలుగా మహిళా వసతి గృహాలు నిలిస్తే బాయ్స్‌ హాస్టల్‌ లో పందులు కుక్కలు పాములుతో బాధలు వెదలు అత్యంత ఘోరంగా వున్నాయి.

కాకతీయ యూనివర్సిటీలో సుమారు 24 డిపార్ట్మెంట్‌ లు వుండగా వాటిలో వివిధ కోర్సులు చదివే విద్యార్థులు వేల సంఖ్యలో వున్నారు విద్యార్థులకు వసతి గృహా సదుపాయం పూర్తిస్థాయిలో కల్పించక పోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ చదువులు సాగించవలసిన పరిస్థితికి నేటి విద్యార్థులు నెట్టవేయబడ్డారు విద్యా సంవత్సర ప్రారంభంలో ఎంతో శ్రమతో ఖర్చుతో తమవిలువైన సమయాన్ని వెచ్చించి రేపటి కలల భవిష్యత్తును తీర్చి దిద్దుకోవడానికి యూనివర్సిటీలను ఆసరాగా చేసుకోని ప్రొఫెసర్స్‌ మార్గ నిర్దేషకులుగా ఉంటారని భావించి గ్రామీణ పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు యూనివర్సిటీలో సీటు పొందాలనే తపనతో ప్రవేశ పరీక్ష రాశారు తోటి విద్యార్థుల పోటీని తట్టుకొని ర్యాంకులు సాధించుకొని ర్యాంక్‌ కార్డ్‌ తో విశ్వవిద్యాలయంలోకి అడుగుపెట్టడంతో తొలి అడుగులోనే తనుకన్న కలలకు ఆటంకాలు సృష్టించడానికి యూనివర్సిటీ అసౌకర్యాలతో స్వాగతం పలుకుతుంది .

విద్యార్థుల ప్రాథమిక అవసరాలు వసతి గృహాలు పోందడానికి ఎదురు చూడవల్సన సమయం ఎంతో.. చేయవల్సిన ప్రయత్నాలు ఎన్నో ….! ప్రశాంతంగా చదువుకోవడానికి ఒక నిర్థిష్ట అంశం పై దృష్టి కేంద్రీకరించడానికి అవకాశం కల్పించాల్సిన విశ్వవిద్యాలయాలు సైతం విద్యార్థులకు వుర్తిస్తాయిలో వసతి గృహా సదుపాయాలు కల్పించలేక పోతున్నాయి పరిశోధక విద్యార్థులు సైతం చిందరవందరగా తమ పరిశోధనలకు అననుకూలంగా వుండే ప్రదేశాలలో వుండే పరిస్థితి నెలకొంటే రేపటితరం యొక్క సేవలు గొప్ప ఆవిష్కరణలను దూరం చేయడానికి అస్కారం ఇక్కడ నుండే మొదలవడం బాధాకరం.

యూనివర్సిటీలలో బాలుల (9).బాలికల హాస్టల్‌ (3 )రీసెర్చ్‌ స్కాలర్స్‌ హాస్టల్‌ (1 ) లా హాస్టల్‌ సుబేదారి (1) పదుల సంఖ్యలో వసతి గృహాలు ఉన్నవి ఒకే కామన్‌ మెస్‌ పేరుతోనే విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని ఇస్తున్నారు అవినీతి నిలయంగా మారిన ఆరు నెలల్లో నలుగురు హాస్టల్‌ డైరెక్టర్‌ లు మారారు ఒక అసిస్టెంట్‌ రిజిస్టర్‌ ఏకంగా ఏసీబి వలలో పడ్డాడు ఇది యూనివర్సిటీ చరిత్ర ఉన్న హాస్టల్స్‌ కొన్ని పురాతన కాలనికి చెందినవి శిథిలావస్థకు చేరినటువంటివి వర్షాకాలంలో కురుస్తూ ఎండా కాలంలో విపరీతమైన వేడిమినిచ్చే ఇంకా వర్సిటీలో నెలకొని ఉండటం దారుణమైన బాధాకరమైన విషయం సమస్యలతో విద్యార్థులు కకలా వికలం అవుతున్నా సంవత్సరాల తెరబడి సమస్యలు మూలుగుతున్నా ఆ సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రావటానికి పరిపాలన విభాగం ఆలోచించక పోవడం బాధాకరం కనీసం మానవతా దృష్టితో అయినా విద్యార్థి పక్షాన ఆలోచించాల్సిన అధ్యాపక బృంధం ఆ బాధ్యతను విస్మరించడం ఆశ్చర్యకరం … ఆందోలనకరం. దేశంలోని ప్రతిష్టాత్మక వర్సిటీలలో ఏ ప్లస్‌ స్థానంలోవున్నామని మరింత వేగంగా ముందుకు వెళ్లాం అని చెప్పకోనే వర్సిటీ పరిపాలన విభాగం విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రథమ స్థానంలో ఉండాలనే విషయంలో అట్టడుగు నుండి ప్రధమ స్థానంలో వున్నామనే విషయాన్ని పట్టనట్లు వ్యవహరించడం వారియొక్క దృష్టి మంద్యతను తెలుపుతుంది. పోతన హాస్టల్‌ లో ఫ్యాన్‌ విరిగి విద్యార్థిని మీద పడ్డ గాయాలైన, పై స్టాప్‌ పిచ్చలూడిపడిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవరిస్తున్నారు.

సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులు – విద్యార్థుల బాధలు
వర్సిటీలో సెల్‌ ఫైనాన్స్‌ కోర్సుల పేరుతో కొత్త కొత్త కోర్సులను రూపొందించి తద్వారా అధిక నిధులు కార్పొరేట్‌ కంపెనీలకు కార్మికులను తయారు చేయడానికి ఉత్సహం చూపిస్తున్న కోర్స్‌ రూపకర్తలు ఆ కోర్సులలో ప్రవేశం పొందే విద్యార్థుల అవసరాలు మౌలిక వసతుల గుర్చి పట్టించుకోకుండా గాలిలో దీపం పెట్టిన చందంగా వ్యవహరిస్తున్నారు వర్సిటీలో పదుల సంఖ్యలో నూతనంగా సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులు సృష్టిస్తున్నారు.సాధారణ విద్యార్థుల మాదిరిగానే ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. యుజిసి నుండి రెగ్యులర్‌ విద్యార్థులు ఫీజులు పొందితే రియంబర్సమెంట్‌ పేరుతో ప్రతి సెమిస్టర్‌ కు సుమారు 25 వేల రూపాయలు పైగా నిధులు మంజూరు అవుతుంటాయి ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ ధనం పొంది వివిధ అభివృద్ధి కార్యక్రలాపాలను రూపొందిస్తున్నామని చెప్పే వర్శిటీ పరిపాలకులు నిధులు మంజూరుకు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులు బంగారు బాతులుగా వుపయోగపడుతున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించి సౌకర్యాలు కల్పించకుండా చుక్కలు చూపిస్తున్నారు దిక్కున్న చోట చెప్పుకొండనే నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తున్నారు.

సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విద్యార్థులకు వసతి గృహాల సదుపాయం లేదని మెస్‌ సౌకర్యం మాత్రమే వున్నదని హాస్టల్‌ సదుపాయం ఆలస్యంగా ఇస్తామని అసలే ఇవ్వకపోవచ్చు అంటూ కాకమ్మ కబుర్లు చెబుతూ కాలం వెల్లబుచ్చడం అలవాటుగా మార్చుకుటున్నారు విద్యార్థులు పట్టు వదలని విక్రమార్కునిగా నిరంతయంగా ప్రయత్నిస్తూ విద్యా సంవత్సం మధ్యలో వసతి గృహా సదుపాయం పొందినా అది హాస్పిటల్‌ జనరల్‌ వార్డు మాదిరిగా 25 నుండి 30 మంది విద్యార్థులకు ఒక పెద్ద హాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం సర్వ సాధారణం అయిపోయింది చదువు ప్రధాన అంశంగా జీవితంలో ఎదో ఒకటి సాధించాలనే తపన వున్న విద్యార్థులు చదువు బండి ఆదిలోనే అనేక ఇబ్బందులతో అగిపోయే పరిస్థితిని అధికారులు సృష్టిస్తున్నారు.

విశ్వవిద్యలయ స్థాయిలో సైతం నిత్యం సమస్యలు సౌకర్యాల గుర్చి చర్చించే సౌకర్యాల కోసం ఉద్యమించే సందర్భాన్ని తగ్గించడానికి విద్యార్థుల భవిష్యత్‌ యొక్క మరింత వేగంగా ఆరోగ్యంగా పెరగడానికి అధ్యాపక వర్గం ఉతేజరకంగా మారాల్సిన చారిత్రక సందర్భాన్ని గుర్తించవల్సిన ఆవశ్యకత ఎంతో వుంది విద్యార్థులు తమ చదువులపై కేంద్రీకరించడానికి అనువైన వాతావరణ రూపకల్పనలో వారికి అవసరమైన వసతులు సరిపడా నిర్మించడానికి స్వచ్ఛందంగా (బాధ్యతగా) నిర్వర్తించడానికి సన్నద్దం కావాల్సిన ఆవశ్యకత వున్నది విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల మధ్య వైషమ్యాలు సృష్టించి ఆత్మనూన్యతకు గురిచేసే కోర్సుల రూపకల్పనను విరమించుకొని తమ లాభాల కోసం నిధుల సేకరణ కోసం ప్రవేశపెట్టిన సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులకు స్వస్తిపలికి తక్షణమే రెగ్యులర్‌ చేయడానికి వూనుకుంటే విద్యార్ధి అభివృద్ది కారకులుగా చరిత్రలో మిగిలిపోవచ్చు స్థానం సంపాదించనచ్చు.
    -స్టాలిన్‌
న్యాయ శాస్త్ర విద్యార్థి
కాకతీయ విశ్వవిద్యాలయం
ఎస్‌.ఎఫ్‌.ఐ అధ్యక్షులు
హనుమకొండ
7416420830

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page