2026 నాటికి ధరల సూచిని 4.1 శాతానికి తగ్గించే లక్ష్యం
కల్తీ, అనారోగ్యకరమైన ఆహారమే వ్యాధులకు కారణం
అంచనా వేసిన ఆర్థిక సర్వే..పార్లమెంట్‌కు సమర్పణ
న్యూ దిల్లీ, జూలై 22 : షరా మామూలుగానే నేడు కేంద్ర బడ్జెట్ 2024..ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందుసోమవారం ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టారు. లోక్ సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. దేశ ఆర్థిక వృద్ధి 6.5 నుంచి 7 శాతంగా ఉంటుందని అంచనా. మార్కెట్ అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని..అందుకు తగ్గట్టుగా రిస్క్ ఎక్కువగా ఉంటుందని..అయినా వృద్ధి రేటు కొనసాగుతుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ద్రవ్యోల్భణం..ధరల సూచి 4.5 శాతంగా ఉంటుందని..2026 నాటికి ధరల సూచిని 4.1 శాతానికి తగ్గించటమే లక్ష్యంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. దేశంలోని ప్రజలు 54 శాతం వ్యాధులు, రోగాలకు కల్తీ, అనారోగ్యకరమైన ఆహారమే కారణం అని..ఈ విషయంలో మార్పు అవసరమని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. సమతుల్యమైన ఆహారం, నాణ్యమైన ఆహారం వైపు మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్థిక సర్వే చెబుతుంది.
చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా పెరిగినట్లు ఆర్థిక సర్వే వెల్లడిరచింది. దీని వల్ల దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు పెంచటానికి ఈ పెట్టుబడులు ఎంతో ఉపయోగపడతాయని స్పష్టం చేసింది ఆర్థిక సర్వే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..ప్రభావం ఉద్యోగులు, కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. పప్పు ధాన్యాల లోటు కొనసాగటం వల్ల..దిగుమతులు తప్పవు అనేది స్పష్టం చేసింది ఆర్థిక సర్వే. దేశంలోని బ్యాంకింగ్, ఆర్థిక రంగాలు అద్భుతమైన పనితీరు చూపించటంతో..ఆర్థిక ఒడుదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కున్నట్లు ఆర్థిక సర్వే స్పష్టం చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాలు, దేశంలోని క్లిష్టమైన ఆర్థిక రంగాన్ని సమర్థవంతంగా ఎదుర్కువాలంటే స్థానిక ఉత్పత్తులు, వినియోగం ద్వారానే అడ్డుకట్ట వేయొచ్చని అభిప్రాయపడిరది ఆర్థిక సర్వే. ఆర్థిక సర్వేతో పాటు మంత్రి నిర్మల గణాంక అనుబంధాన్ని కూడా సభలో ప్రవేశపెట్టారు.
కాగా బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వొస్తుంది. గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును..రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఈ ఎకనమిక్ సర్వే. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్లోని ఎకనమిక్ డివిజన్ ఈ సర్వేను రూపొందిస్తుంది. తొలుత 1950`51 సంవత్సరం నుంచి ఆర్థిక సర్వేను బడ్జెట్‌తో పాటే ప్రవేశపెట్టేవారు. 1960 తర్వాత బడ్జెట్‌కు ఒక రోజు ముందు ప్రవేశపెట్టే సంప్రదాయం మొదలైంది. అంతర్జాతీయ భౌగోళిక పరిణామాలు, వాటి ప్రభావం ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలను ప్రభావితం చేయొచ్చు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కార్పొరేట్, బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్స్ బలంగా ఉన్నాయి. ప్రైవేటు పెట్టుబడుల వృద్ధికి ఇది దోహదం చేస్తుంది. భారత వృద్ధిలో క్యాపిటల్ మార్కెట్లది కీలకపాత్ర. భౌగోళిక రాజకీయ, ఆర్థిక పరిణామాలను తట్టుకోలదని ఆర్థిక సర్వే అభిప్రాయం.