– 300కుపైగా బీజీఎల్ షెల్స్ స్వాధీనం ఇదే మొదటిసారి
– భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు
చర్ల, ప్రజాతంత్ర, నవంబర్ 17 : ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌లను స్వాధీనం చేసుకున్నాయి. పూజారి కాంకేర్ సమీపంలోని అడవుల్లో మూడు వేర్వేరు డంప్‌ల నుంచి 300కు పైగా బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ (బీజీఎల్) షెల్స్‌ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత మావోయిస్ట్ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్‌కు చెందిన మూడు డంప్‌లలో సింథటిక్ నీటి డ్రమ్ములలో దాచి ఉంచిన 280 బీజీఎల్‌షెల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు చర్ల పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, బాంబ్ డిస్పోజల్ బృందాలు ఈనెల 16న గాలింపు చర్యలు చేపట్టి వీటిని స్వాధీనం చేసుకున్నాయి. భవిష్యత్ అవసరాల కోసం 2025 ప్రారంభంలో మావోయిస్టులు ఈ ఆయుధాలను దాచిపెట్టి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మందుపాతరల ప్రమాదం ఉన్నందున ప్రజలు కర్రెగుట్టల అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. ఈనెల మొదటి వారంలో కూడా ఈ ప్రాంతంలో భద్రతా బలగాలు భారీగా బీజీఎల్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి విదితమే. చర్ల పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్‌రాಜು మాట్లాడుతూ తెలంగాణ పోలీసులు ఇంత పెద్ద ఎత్తున బీజీఎల్స్ స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారన్నారు. మీడియా సమావేశంలో డీఎస్పీ అరుణ్‌కుమార్, సీఐ రాజవర్మ, సీఆర్పీఎఫ్ 141 ఏసీ విక్రమ్ రంజన్, ఎస్సై నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



