ఎవరికి భయపడి ఈ నిర్ణయం

  • విమోచన దినంపై రేవంత్‌ ‌వెనకడుగు
  • కెసిఆర్‌కు నీకు తేడా లేదని రుజువయ్యింది
  • సిఎం రేవంత్‌పై మండిపడ్డ కేంద్ర మంత్రి బండి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహంచడంలో రేవంత్‌ ‌రెడ్డి భయపడుతున్నారని కాంగ్రెస్‌ ‌ప్రజా పాలనపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎవరికి భయపడి ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలన్నారు. కేసీఆర్‌…‌రేవంత్‌ ‌రెడ్డి సేమ్‌ ‌టు సేమ్‌ అం‌టూ వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి అస్సలు తేడా లేదని ఎద్దేవా చేశారు. సెప్టెంబర్‌ 17‌పై సీఎం రేవంత్‌ ‌రెడ్డి మాట మార్చటం సిగ్గుచేటన్నారు. ఆరు గ్యారంటీలను డైవర్ట్ ‌చేయటానికే హైడ్రా పేరుతో డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు.

 

ప్రజా పాలన దినోత్సవం కాదని…విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్‌ ‌చేశారు. రైతులను నడ్డి విరచటమే కాంగ్రెస్‌ ‌ప్రజ పాలన అంటూ వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులను మోసం చేయటమే కాంగ్రెస్‌ ‌ప్రజాపాలన అని విమర్శించారు. బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కొట్టుకోవటమే ప్రజాపాలన అని అన్నారు. విదేశాల్లో భారతదేశంపై రాహుల్‌ ‌గాంధీ వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. టెర్రరిస్టులతో రాహుల్‌ ‌గాంధీకి సంబంధాలున్నాయని ఆరోపించారు. ఎలక్షన్‌ ‌కమిషన్‌ ‌బీజేపీ కంట్రోల్‌లో ఉంటే 500 ఎంపీ సీట్లు గెలుచుకునేవాళ్ళమని తెలిపారు. సిక్కులను ఊచకోత కోసిందే రాహుల్‌ ‌గాంధీ కుటుంబం అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్‌ ‌విరుచుకుపడ్డారు.

విపక్షానికే పిఎసి ఛైర్మన్‌ ‌పదవి దిల్లీలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్య
న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 12 : ‌పబ్లిక్‌ అకౌంట్స్ ‌కమిటీ ఛైర్మన్‌ ‌పదవి ప్రతిపక్షానికే ఇచ్చామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన వి•డియాతో మాట్లాడుతూ…అసెంబ్లీ చివరి రోజు బిఆర్‌ఎస్‌ ‌సభ్యుల సంఖ్యను ప్రకటించారు.. 38 మంది అని ప్రకటించినప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. 2019 నుంచి అక్బరుద్దీన్‌ ‌పీఏసీ ఛైర్మన్‌గా ఎలా ఉంటారని, కాంగ్రెస్‌ ‌ప్రతిపక్షంగా ఉంటే ఎంఐఎంకు పీఏసీ ఛైర్మన్‌ ‌పదవి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. బతకడానికి వొచ్చినోళ్ల వోట్లు కావాలి కానీ, వాళ్లకు సీట్లు ఇవ్వొద్దా అని ప్రశ్నిస్తూ..బతకడానికి వొచ్చినోళ్లు అంటూ కౌశిక్‌ ‌చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. పార్టీ ఫిరాయింపులపై చట్టం కఠినంగా ఉంటే మంచిదేనని, కోర్టు తీర్పులు తమకే మేలు చేస్తాయని సీఎం రేవంత్‌ అన్నారు.

ఉప ఎన్నికలు వొచ్చినా గెలుపు కాంగ్రెస్‌దే
కొత్త పిసిసి చీఫ్‌గా నియమితులయిన మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌వ్యాఖ్య
న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 12 : ‌తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ…ఈ ప్రచారంపై కొత్త టీపీసీసీ చీ••గా నియమితులయిన మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌స్పందించారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒకవేళ వొచ్చినా కాంగ్రెస్‌ ‌ఖాతాలోనే చేరుతాయని ఆయన తేల్చిచెప్పారు. గురువారం దిల్లీలో ఏఐసీసీ చీఫ్‌ ‌ఖర్గేను మహేష్‌ ‌కుమార్‌ ‌కలిశారు. అనంతరం ఆయన వి•డియాతో మాట్లాడుతూ… 60 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న మహానాయకుడు ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నారని..ఖర్గేను కలిసి ఆశీస్సులు తీసుకున్నానని అన్నారు. అన్ని వర్గాలను కలుపుకొని కాంగ్రెస్‌ ‌బలోపేతానికి పనిచేయాలని ఖర్గే సూచన చేశారన్నారు. కాంగ్రెస్‌ ‌కార్యకర్త మొదలుకొని సీనియర్‌ ‌నాయకులను కలుపుకొని వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు వచ్చిన స్థానాలకంటే ఎక్కువ సాధించి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్‌ ‌గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేయబోతున్నామన్నారు.

 

మంత్రివర్గ విస్తరణ గురించి సీఎం, ఏఐసీసీ పెద్దలు మాట్లాడారని.. వారే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కొత్త కమిటీ ఏర్పాటు అయ్యేంత వరకు పాత కమిటీలు పనిచేస్తాయన్నారు. బాధ్యతలు చేపట్టాక కొత్త కార్యవర్గంపై అధిష్టానంతో చర్చలు జరుపుతానని చెప్పారు. ప్రజలు నమ్మకంతో కాంగ్రెస్‌కు అధికారాన్ని ఇచ్చారని.. సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు. కమిటీల్లో అన్ని సామాజికవర్గాలకు సముచిత ప్రాధాన్యత ఉంటుందన్నారు. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు సమయం ఇచ్చిందని… మరికొంతమంది పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కేటీఆర్‌ ‌సవాళ్ళను పట్టించుకునే స్థితిలో లేరని… ప్రతిపక్ష పాత్ర ఇస్తే దాన్ని కూడా సమర్ధవంతంగా నిర్వహించే స్థితిలో లేరని విమర్శించారు. వర్షాలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. అలాగే అరికపూడి గాంధీ సాంకేతికంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అని.. సాంకేతికంగా ఆయనకు పీఏసీ చైర్మన్‌ ఇచ్చామని మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌వెల్లడించారు.

ఖమ్మంలో కేంద్ర బృందం పర్యటన
మున్నేరు ప్రాంతంలో ఇళ్ల పరిశీలన
ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌ఖమ్మం నగరంలో కేంద్ర బృందం గురువారం ఉదయం పర్యటించింది. బొక్కల గడ్డ, జలగం నగర్‌, ‌మోతీ నగర్‌, ‌ప్రకాష్‌ ‌నగర్‌, ‌దంసలాపురం ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటించింది. మున్నేరు వరద కారణంగా నష్టపోయిన ఇళ్లను బృందం సభ్యులు పరిశీలించారు. రెండు బృందాలుగా మున్నేరు వరద ప్రాంతాలను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. నష్టపోయిన వరద బాధితులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన కుటుంబాలకు అండగా ఉంటామని కేంద్ర బృందం హావి• ఇచ్చింది. జలగం నగర్‌ ‌నుంచి కోదాడ కేంద్ర బృందం బయలుదేరింది. కేంద్ర బృందానికి వరదనష్టం వివరాలను జిల్లా కలెక్టర్‌ ‌ముజామిల్‌ ‌ఖాన్‌, ‌నగరపాలక సంస్థ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య తెలియజేశారు. ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.

 

భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దాదాపు పదిరోజుల పాటు జిల్లా ప్రజలను మున్నేరు వణికించింది. గ్రామాలకు గ్రామాలు వరద నీటిలోని ఉండిపోయాయి. వెంటనే ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. మున్నేరు వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి ఆహారం, తాగునీరు, వైద్యసాయాన్ని అందించారు. వరద ముంపు ప్రాంతాల్లో అధికార, ప్రతిపక్ష నేతలు పర్యటించి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు.

 

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి తదితరులు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. యితే వరద ముంపు తగ్గాక ఇంటికి వెళ్లిన బాధితులు అక్కడ పరిస్థితి చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. వరద ధాటికి కొట్టుకుపోయిన ఇళ్లను చూసి రోదించారు. మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు దయనీయ స్థితిలో ఉన్నారు. వేలాది మంది ప్రజలు సర్వం కోల్పోయి నడి వీధిలో నిలబడ్డారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని మున్నేరు వరద ముంపు బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page