మెగా గ్రోత్ కారిడార్ రాష్ట్రానికి కీలకం

– రాబోయే ఎయిర్ పోర్టులకు రోడ్లు నిర్మించాలి
– అభివృద్ధిపై ఒకే తరహా ప్రణాళికతో ముందుకెళ్లాలి
– వివిధ అంశాలపై సీఎం రేవంత్ సమీక్ష

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 13: వరంగల్, కరీంనగర్, ఖమ్మం మెగా గ్రోత్ కారిడార్ భవిష్యత్ తెలంగాణకు చాలా కీలకమని, ఎయిర్ పోర్టు రాకతో ఈ ప్రాంతం రూపురేఖలు మారనున్నాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని, అవసరమైన ఎస్టీపీలు డిజైన్ చేయాలని సూచించారు. ఎంసీహెచఆర్డీ బోధి పెవిలియన్లో మెగా గ్రోత్ కారిడార్పై ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. రాబోయే ఎయిర్పోర్టులను దృష్టిలో ఉంచుకుని రోడ్లను నిర్మించాలన్నారు. మహబూబ్ నగర్, భూత్పూర్, జడ్చర్లలను కలిపి కారిడార్గా, కొత్తగూడం, పాల్వంచ, సుజాతనగర్ కలిపి కారిడార్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణంలో సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. ఖర్చు తగ్గించుకోవడానికి ఈవీ వాహనాలను ప్రవేశపెట్టాలని, లీజ్కు తీసుకునే వాహనాలు కూడా ఈవీవే ఉండాలని తెలిపారు. ప్రతిచోటా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా ఉ ండాలని, అర్బన్ సెంట్రిక్ డెవలప్మెంట్ ప్లానింగ్ ఉండాలని సూచించారు. అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్స్, వేస్ట్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు అర్బన్ ప్లానింగ్లో తప్పనిసరిగా ఉండాలన్నారు. మున్సిపాలిటీలలో | సోలార్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, పట్టణాలు, నగరాల్లో రేడియేషన్ తగ్గించడానికి మల్టీ యుటిలిటీ టవర్స్ ఏర్పాటు చేయాలని, ప్రతి చోటా స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని, ఆయా నగరాలు, పట్టణాల జనాభాకు తగినట్లు స్థానికంగా డిజైన్ చేసుకోవాలని చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణపై ఏఐ వినియోగానికి సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకోవాలన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *