హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ ఠాణా పరిధిలో నేపాలీ దోపిడీ దొంగలు రెచ్చిపోయిన ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కౌకూరు గోల్ఫ్ ఎనక్లేవ్లో విశ్రాంత ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, భార్య డాక్టర్ విజయలక్ష్మిని బంధించి 75 తులాల బంగారం, 20 కిలోల వెండితో నిందితులు పరారైన విషయం తెలిసిందే. దోపిడీలో ఎనిమిదిమంది సభ్యుల నేపాలీ ముఠా పాల్గొన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. వృద్ధ దంపతులను ఇంట్లో బంధించిన తర్వాత నిందితులు ఆటో బుక్ చేసుకుని అక్కడినుంచి వెళ్లిపోయిన సీసీ టీవీ ఫుటేజ్ను పోలీసులు సేకరించారు. ఘటన తర్వాత ప్రొఫెసర్ ఇంట్లోని హార్డ్ డిస్క్, సీసీ కెమెరాలను నిందితులు ధ్వంసం చేసినట్టు పోలీసులు తెలిపారు. మల్కాజిగిరి సీపీ సుమతి ఘటనాస్థలిని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. నిందితులంతా ఇప్పటికే నేపాల్ చేరుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



