పత్తి రైతులను మోసగిస్తే క‌ఠిన‌ చర్యలు

ప్రైవేటు వ్యాపారులకు మంత్రి తుమ్మల హెచ్చరిక
ఖమ్మం జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: ‌పత్తి రైతులను మోసం చేసే ప్రైవేటు వ్యాపారులపై చర్యలు తప్పవని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ ‌రావు హెచ్చరించారు. రైతులకు ఇబ్బంది లేకుంగా రెవెన్యూ మార్కెటింగ్‌ అధికారులు దగ్గరుండి చూడాలని అన్నారు. గుర్రాలపాడులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ ‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా 40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారని తెలిపారు.

వాతావరణ పరిస్థితుల దృష్టా ఈ సారి పత్తి దిగుబడి తగ్గిందని, ఖమ్మం జిల్లాలో 17 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. ఖమ్మం జిల్లాల్లో తొమ్మిది సిసిఐ కొనుగోలు కేంద్రాలు ద్వారా పత్తి కొనుగోలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులు సంప్రదాయ పంటలు నుంచి ఉద్యాన పంటల వైపు మళ్లాలన్నారు. పత్తి, మిర్చి స్థానంలో పామాయిల్‌ ‌సాగు చేస్తే అధిక లాభం వస్తుందని, రైతులకు గిట్టుబాటు ధర అందించాలనేదే తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ‘రైతులకు ఇబ్బంది లేకుండా రెవెన్యూ,మార్కెటింగ్‌ అధికారులే చూడాలన్నారు.

నాణ్య‌మైన ప‌త్తి తీసుకురావాలి : మంత్రి  కొండా సురేఖ‌
రైతులు నాణ్యమైన పత్తి తీసుకొచ్చి గరిష్ట ధర పొందాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. వరంగ‌ల్‌ ఏనుమాముల మార్కెట్‌లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సురేఖ ప్రారంభించారు. ఏనుమాముల మార్కెట్‌కు వచ్చిన ప్రతీ పత్తి బస్తాను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. కాగా  ఏనుమాముల మార్కెట్‌ ‌కు తెల్ల బంగారం పోటెత్తింది. వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో క్వింటాల్‌ ‌పతి ధర రూ. 7521గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page