హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (వైఐపీఎస్)కు మూడు కార్పొరేట్ సంస్థలు రూ.42.5 లక్షల కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) నిధులను విరాళంగా అందించాయి .కోహినూర్ గ్రూపునకు చెందిన ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.25 లక్షలు విరాళంగా అందించింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ అహ్మద్ ఖాద్రీ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహమ్మద్ అమ్జద్, ఆయన కుమారుడు మహమ్మద్ నిసార్ ఖాద్రీ ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును డీజీపీ సి.వి.ఆనంద్‌కు అందజేశారు. అలాగే పుజ్జోలానా మెషినరీ ఫ్యాబ్రికేషన్స్ ఎల్‌ఎల్‌పీ, ఆర్యన్ ప్రెసిషన్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పాయ్ రూ.10 లక్షలు అందించారు. దివ్య శక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపక డైరెక్టర్ రవీంద్ర కుమార్ అగర్వాల్ రూ.7.5 లక్షల విరాళాన్ని అందజేశారు. పోలీసు సిబ్బంది సమాజానికి అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ వారి పిల్లల విద్యాభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ విరాళాలు అందించినట్లు సంస్థల ప్రతినిధులు తెలిపారు. విద్యాభివృద్ధికి ఉదారంగా సహకరించిన సంస్థల ప్రతినిధులను డీజీపీ ఆనంద్ అభినందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





