– డీజీపీ కార్యాలయంలో రాష్ట్రీయ ఏక్తా దివస్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యతా దినోత్సవం(రాష్ట్రీయ ఏక్తా దివస్) కార్యక్రమాన్ని డీజీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ (పి అండ్ ఎల్) గజరావు భూపాల్ పోలీసు అధికారులు, సిబ్బందితో జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు. మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి దేశ సమైక్యత, సమగ్రత కోసం సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. స్వాతంత్య్రానంతరం సంస్థానాల విలీనంలో కీలక పాత్ర పోషించి దేశ ఐక్యతకు బలమైన పునాది వేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ జాతీయ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఐజీ (అడ్మిన్) అన్యోన్య, పలువురు పోలీసు అధికారులు, సీఏవోలు, ఏవోలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





