రఘునాధపాలెం ఎన్‌కౌంటర్‌ ‌విప్లవ ద్రోహుల పనే

ఎన్‌కౌంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి
లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ నాయకులు ఆజాద్‌
ఈ ‌నెల 9న జిల్లా బంద్‌కు పిలుపు

భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 05 : ‌కరకగూడెం మండలం రఘునాథపాలెంలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌ ‌విప్లవద్రోహుల పనే అని, ఈ ఎన్‌కౌంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మావోయిస్టు పార్టీ భదాద్రి కొత్తగూడెం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా నాయకులు ఆజాద్‌ ‌లేఖ విడుదల చేసారు. రఘునాధపాలెం ఎన్‌కౌంటర్‌ ‌విప్లవ ద్రోహులు అందించిన సమాచారంతోనే జరిగిందని, ఎన్‌కౌంటర్‌లో తమ పార్టీ డివిజన్‌ ‌కమిటి సభ్యులు కామ్రేడ్‌ ‌లచ్చన్నతో పాటు ఆరుగురు గ్రేహౌండ్‌స్ ‌పోలీసుల చేతులో హత్యగావించబడ్డారని లేఖలో పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని లేఖలో తెలిపారు. గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమీత్‌ ‌షా ఆధ్వర్యంలో ఏర్పడ్డ పోలీస్‌ ‌నిరంతరం వివిధ రకాలుగా దాడులకు తెగబడుతుందని లేఖలో తెలిపారు.

ఆపరేషన్‌ ‌కగార్‌లో భాగంగానే ఈ ఎన్‌కౌంటర్‌ ‌జరిగిందని స్పష్టం చేసారు. మావోయిస్టు పార్టీ నిర్మూలన కోసం రెండు ప్రభుత్వాలు తీవ్రంగా పోటి పడుతున్నాయని లేఖలో తెలిపారు. మావోయిస్టు పార్టీకి త్యాగాలు కొత్త కాదని తెలిపారు. ఇప్పటికే దోపిడి పీడన లేని రాజ్యం కోసం రాజ్యంతో పోరాడి వేలమంది అమరులయ్యారని లేఖలో గుర్తు చేసారు. పార్టీని నిర్మూలించాలని రెండు ప్రభుత్వాలు చేస్తున్న హత్యలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. ఇలాంటి బూటకపు ఎన్‌కౌంటర్‌లు, దాడులకు మావోయిస్టు పార్టీ భయపడదని లేఖలో పేర్కొన్నారు.

రఘునాధపాలెం ఎన్‌కౌంటర్‌కు అధికార కాంగ్రెస్‌ ‌పార్టీ పూర్తి బాధ్యత వహించాలని, ముఖ్యంగా ఈ జిల్లాకు చెందిన మంత్రులు ప్రధాన బాధ్యత వహించాల్సి ఉంటుందని లేఖలో తెలిపారు. మావోయిస్టుల నెత్తుటి బాకీని త్వరలోనే  తీర్చుకుంటామని లేఖలో హెచ్చరించారు. రఘునాధపాలెం ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 9వ తేదీన జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ నాయకులు ఆజాద్‌ ‌లేఖలో పేర్కొన్నారు. ప్రజలు వ్యాపార సంస్ధలు సహకరించాల్సిందిగా కోరారు. రఘునాధపాలెం ఎన్‌కౌంటర్‌కు ప్రజలు, ప్రజాస్వామికవాదులు సహకకరించాలని కోరారు.

 

నిండుకుండలా నిజాంసాగర్‌
మూడు గేట్లు ఎత్తి 15వేల క్యూసెక్కుల నీటి విడుదల
ప్రశీరామ్‌ ‌సాగర్‌కు భారీగా వరద..41 గేట్లు దిగువకు నీరు విడుదల

కామారెడ్డి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ ‌జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో భారీగా వరద అక్కడికి చేరుతుంది. దీంతో మూడు గేట్లు ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు. ప్రస్తుతం 1,404 అడుగులకు చేరుకోడంతో మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు శ్రీరామ్‌ ‌సాగర్‌ ‌ప్రాజెక్ట్‌కు భారీ వరద కొనసాగుతున్నది. ఎగువ మహారాష్ట్ర, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఎస్సారెస్పీకి భారీగా వరద వొస్తుంది.

ప్రస్తుతం 2 లక్షల 25 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వొస్తుండడంతో 3 లక్షల 24 వేల క్యూసెక్కుల ఔట్‌ ‌ఫ్లోను 41 వరద గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. ఎస్సారెస్పీలో గరిష్ఠ నీటిమట్టం 1,091 అడుగులు కాగా 1,089 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 73.458 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. కాగా, భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు. నవీపేట మండలంలోని మిట్టాపూర్‌ ‌శివారులోని వందలాది ఎకరాల పంట నీట మునిగింది. శ్రీరాంసాగర్‌ ‌బ్యాక్‌ ‌వాటర్‌ ‌ముంచెత్తడంతో వరి పైర్లు పూర్తిగా మునిగి పోయాయి. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తింది. మండలంలోని యంచ, నందిగామ, మిట్టాపూర్‌, ‌కోస్లీ, బినోలా తదితర గ్రామాలకు చెందిన పంట పొలాలను శ్రీరాంసాగర్‌ ‌బ్యాక్‌ ‌వాటర్‌ ‌ముంచెత్తింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page