వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

September 7, 2019

మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
46 అడుగులకు చేరుకునే అవకాశంగత మూడు రోజుల నుండి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న బారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శనివారం సాయంత్రానికి 43 అడుగులకు చేరుకుంది. దీనితో అధికారులు మొదటి ప్రమాదన హెచ్చరికను జారీ చేసారు. ఇది క్రమంగా పెరుగుతూ 46 అడుగుల వరకు పెరిగే అవకాశ: ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసారు. వరద ఉధృతి ఎక్కువైనట్లేతే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్దం చేస్తున్నారు. గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్ళే జాలరులకు కూడ ఆదేవాలు జారీ చేసారు. ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్ళవద్దని అధికారులు చెప్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వరద నీరు ఎక్కువ కావడంతో దిగువ ప్రాంతాలకు వదలటం వ)న భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. శుక్రవారం నాటికి 35 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం శనివారం సాయంత్రానికి 43 అడుగులకు చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తుంది. ఇది మరింద పెరిగి 46 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు.