ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు గడువును పొడిగించాలి

– సర్టిఫికెట్లపై గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ నిబంధన తొలగించాలి
– టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కో-ఆర్డినేషన్ కమిటీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28 : మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్ర ఓటర్ల నమోదు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కో-ఆర్డినేషన్ కమిటీ కోరింది. ఈమేరకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్ కుమార్, ‘సర’ రాష్ట్ర కో-ఆర్డినేటర్ గంప వేణుగోపాల్ వినతిపత్రం సమర్పించారు. అవగాహన లోపం, అవసరమైన పత్రాల సేకరణలో ఇబ్బందులు, ధ్రువీకరణ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యల కారణంగా అనేకమంది అర్హులైన పట్టభద్రులు గడువు తేదీలోగా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఓటర్ల నమోదు గడువును కనీసం మరో నాలుగు వారాలు పొడిగించాలని కోరారు. విద్యాసంస్థలు, ప్రైవేట్ టెక్ పార్కులు, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. కాగా, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు జారీ చేసిన డిగ్రీ సర్టిఫికెట్ల ప్రతులపై గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ తప్పనిసరి చేయడం వల్ల దరఖాస్తుదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఈవో దృష్టికి తెచ్చారు. గెజిటెడ్ అధికారులను సంప్రదించడం, ధ్రువీకరణ పొందడం కోసం సమయం వెచ్చించాల్సి రావడంతో నమోదు ప్రక్రియ ఆలస్యమవుతోందన్నారు. ఫారం-18తో పాటు సమర్పించే డిగ్రీ సర్టిఫికెట్లను ఎన్నికల అధికారులు ఆన్‌లైన్ ద్వారా ధ్రువీకరించే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. నిబంధనలకు అనుగుణంగా, స్వీయ ధ్రువీకరణ చేసిన సర్టిఫికెట్లను లేదా ఇతర ప్రత్యామ్నాయ ధ్రువీకరణ పద్ధతులను అనుమతించడం ద్వారా పట్టభద్రుల నమోదు ప్రక్రియను సులభతరం చేయవచ్చని సూచించారు. గత పర్యాయం ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ఓటర్ల నమోదు శాతం తక్కువగా కనిపిస్తోందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. నమోదు ప్రక్రియలో ఉన్న అదనపు నిబంధనలు అర్హులైన పట్టభద్రులకు ఇబ్బందిగా మారకుండా ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ‘సర’కు ముందే సుమారు ఐదు లక్షల ఓట్లను ఫారం 7 ద్వారా తొలగించినట్లు తెలుస్తోందని, ఇది ఎలా జరిగిందో వివరాలు ఇవ్వాలని, ఆ ఓటర్ల ఫారం 7 వివరాలను పునః పరిశీలించాలని రాజేష్, వేణుగోపాల్‌లు కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *