‌ప్రజల ఆస్తులను కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత

  • చెరువుల ఆక్రమణతో ఇబ్బందులు
  • ఆక్రమణల కూల్చివేతలకే హైడ్రా
  • కూల్చివేతలను ప్రజలు హర్షిస్తున్నారు
  • ఎన్‌ ‌కన్వెన్షన్‌ ‌కూల్చివేతపై డిప్యూటి సిఎం భట్టి

న్యూ దిల్లీ, ఆగస్ట్ 24 : ‌గత కొన్నేళ్లుగా రాజధానిలో చెరువులను, ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని, వాటిని కూల్చేయడం సరైందేనని  అంటూ..హౌడ్రా ఎన్‌ ‌కన్వెన్షన్‌ ‌సెంటర్‌ను కూల్చివేయడాన్ని డిప్యూటీ సిఎం భట్టి సమర్థించారు. హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమర్థించారు. దిల్లీ పర్యటనలో ఉన్న భట్టి శనివారం వి•డియాతో మాట్లాడుతూ…హైదరాబాద్‌ ‌నగరం అంటేనే లేక్స్, ‌రాక్స్ అని.. వీటిని కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారన్నారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. చెరువులు ఏవీ ఆక్రమణకు గురికాకుండా పరిరక్షించడం కోసం ఏర్పాటు చేసిందే హైడ్రా అని చెప్పుకొచ్చారు.

దీన్ని ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారన్నారు. ప్రతి పనికి నోటీసులు ఇచ్చి ఆపై చర్యలు తీసుకుంటున్నారన్నారు. బఫర్‌ ‌జోన్‌లో కాదు, నేరుగా చెరువులోనే కట్టిన నిర్మాణాలను కూల్చేస్తున్నారన్నారు. సాటిలైట్‌ ‌ఫోటోల ద్వారా విభజనకు ముందు, విభజన తర్వాత ఈ 10 ఏళ్లలో చెరువులు ఎంత మేర ఆక్రమణకు గురయ్యాయి తెలుసుకుంటున్నామని తెలిపారు. రిమోట్‌ ‌సెన్సింగ్‌ ‌సాటిలైట్‌ ‌ఫోటోలను తీసి, అంతకుముందు ఎన్ని చెరువులు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అన్నది ప్రజల ముందు పెడతామన్నారు. చట్ట ప్రకారం, చట్టానికి లోబడి మాత్రమే చర్యలు చేపడతున్నామన్నారు. అన్నీ లెక్కలతో సహా ప్రజల ముందు పెడతామన్నారు. ప్రజల ఆస్తులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page