మతి మాలిన మనుష్యులను గతి నిలబడనిస్తుందా
పచ్చని పైరుకు రక్షణ ఇవ్వక పీడ నాశనం చేస్తుంది
ఆవేశంతో అగ్గి రగిలించినా న్యాయాన్ని పొందగలమా
కాలిన విత్తులు ఎన్ని విత్తినా చచ్చినా మొలలేవు
సమయం తక్కువన్ని చదువులో చతికిలపడతారా
పరుగుపందెంలో దూరముందనీ కూలబడతామా
మీతి మీరిన ద్వేషం మనిషికీ చ్యుతినిస్తుందా
ఆత్మలో విషం వున్నా బెల్లం తీపెలావుతుంది
గుణం మంచిదయితే మాటలు కఠినంగా వుంటాయా
మాటకున్నా తెగులు మనసుకు ఉండక ఉంటుందా
అల్పుడికీ వచ్చిన అధికారం కలకాలం ఉంటుందా
ఊగి ఊగి ఉయ్యాల ఉన్న చోటికి రాకుండుంటుందా
-ఐ.చిదానందం
8801444335