గ్రామీణ గురుకుల విద్యకు తూట్లు..

వీరిని ప్రభుత్వం గురుకులేతర కళాశాలల్లో సర్దుబాటు చేస్తే బాగుటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లక్షల జీతాలతో రెగ్యులర్ అధ్యాపకుల నియామకం జరిగినపుడు ఏజెన్సీల ద్వారా తక్కువ జీతాలతో తాత్కాలిక నియామకాలను ఎందుకు చేస్తున్నారన్నది సందేహంగానే మిగులుతోంది. రెగ్యులర్ లెక్చరర్ల నియామకం తర్వాత గెస్ట్ ఫ్యాకల్లీలో ఎవరిని కొనసాగించాలో అనే విషయమై సెక్రటరీ సీనియర్ ప్రాతిపదిక సూచించగా.. ఆర్సీవోలు ప్రిన్సిపాళ్ల నిర్ణయం ప్రకారం కొనసాగించడం పలు వివాదాలకు తావిస్తోంది. దీంతో ఆర్సీవోలపై సోసైటీ అజమాయిషీ పూర్తిగా కొరవడినట్లు కనబడుతోంది.

బోధనేతర‌ సిబ్బంది కొరత..

అన్ని గురుకులాల్లో ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ స‌రిప‌డా స్వీపర్లు, వాచ్ మెన్లు అటెండర్లు, స్టాఫ్ నర్సులు లేరు. ఏదైనా జరగరానిది జరిగినప్పుడు హడావిడి తప్పించి శాశ్వత ప‌రిష్కారం చూడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యాలయాల్లో స్టాఫ్ నర్సులు, స్వీపర్లు, క్లర్కులు, వంటి తాత్కాలిక సిబ్బందిని వెంటనే నియమించాలి. ప్రతి వేయి రూపాయల ఖర్చుకు చెక్కు పద్దతిని ఇతర సొసైటీలకు అనుగుణంగా సవరించాలని విద్యార్థులు కోరుతున్నారు.

సమస్యలు పరిష్కారమయ్యేనా?

గురుకులాల్లో ఏ సమస్య వచ్చినా కేవలం విన్నవించుకోవటం తప్పించి సమస్య పరిష్కారం మాత్రం కావ‌డంలేదు. ఆర్సీవోలు కేవలం గురుకులాల్లో ఉన్న వనరులతో సర్దుకోమని మాత్రమే చెబుతున్నారు. పై అధికారులు చూస్తాం.. చేస్తాం.. అంటూ దాటవేస్తున్నారు. దీంతో గురుకులాల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందగా మారింది.

మీడియాపై ఆంక్షలు!

ఇటీవల గురుకులాల పరిస్థితులపై మీడియాలో పలు కథనాలు రావటంతో ఎంజేపీ సొసైటీ సెక్రటరీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియాను విద్యాలయాల్లోకి అనుమతించవద్దు హుకుం జారీ చేశారు. అయితే సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి యత్నం జరగడం లేదని స్పష్టమవుతోంది. మీడియా లేవనెత్తిన సమస్యలు పరిష్కరించే దిశగా సొసైటీ చర్యలు చేపట్టాలి. అధికారులు స్వార్థం కోసం నిర్ణయాలు తీసుకుని సొసైటీకి నష్టం కలిగించకుండా చూడాల్సిన బాధ్యత ఆయా అధికారులపై ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి ఎంజేపీ గురుకుల విద్యను పునరుద్దరించాలని, మంజూరైనా గ్రామీణ ప్రాంతానికే కాలేజీలను తరలించాలని విద్యార్థులు, తల్లి దండ్రులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *