నా మతమేమిటని అందరూ అడుగుతున్నారని..నా మతం మానవత్వ మని కావాలంటే డిక్లరేషన్‌లో రాసుకోవాలని జగన్ సవాల్ చేశారు. దేవుడి దగ్గరకు వెళ్తూంటే ఏ మతం అని అడుగుతారా అని ప్రశ్నించారు. తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న తర్వాత జగన్ విూడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డిక్లరేషన్ అంశంపై స్పందించారు. తాను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానని ప్రకటించారు.
అందులో తప్పేముందన్నారు. బయటకు వెళ్తే హిందూ సంప్రదాయాలను అనుసరిస్తానని చెప్పారు. అలాగే ఇస్లాం నూ గౌరవిస్తానని.. సిక్కిజం ను కూడా ఆచరిస్తానని చెప్పుకొచ్చారు. తన మతం మానవత్వమేనన్నారు. గతంలో తాను పదిహేను సార్లకు పైగా తిరుమల కొండపైకి వెళ్లి వొచ్చానన్నారు. మాజీ ముఖ్యమంత్రికే ఈ పరిస్థితి వొస్తే దళితుల పరిస్థితి ఏమిటని జగన్ ప్రశ్నించారు.