రాష్ట్రంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల తొల‌గింపున‌కు కుట్ర‌

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు

హైద‌రాబాద్ ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 28 : రాష్ట్ర వ్యాప్తంగా 6,200 పాఠశాలలను మూసివేసేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుట్ర చేస్తోంద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ప్రతీ చిన్న గ్రామానికి ప్రైమరీ స్కూల్, ప్రతీ రెవెన్యూ గ్రామానికి అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఏర్పాటు చేస్తామని అభయహస్తం మేనిఫెస్టో లో ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పార్టీ .. ఇప్పుడు అధికారంలోకి వొచ్చి సంవత్సరం కాకముందే.. జీరో స్కూల్ పేరిట 1,899 స్కూళ్లు, 10 మందిలోపు విద్యార్థులు ఉన్న‌ 4,314 స్కూళ్లు మొత్తం కలిపి 6,213 బ‌డుల‌ను శాశ్వతంగా మూసివేసే ప్రణాళికలో భాగంగానే ఆ స్కూల్లో పనిచేసే 5,741 మంది టీచర్లను బదిలీ చేస్తున్నారని హ‌రీష్ రావు విమ‌ర్శించారు. కేసీఆర్ స‌ర్కారు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రూ.7,289 కోట్లతో మన ఊరు – మన బడి, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం సన్న బియ్యంతో పౌష్ఠిక ఆహారం అందించారు. రేవంత్ సర్కారు వొచ్చీ రాగానే సిఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం రద్దు చేయడం, మన ఊరు మన బడి ప్రోగ్రాం కొనసాగించకపోవడం, పురుగుల అన్నం, విషాహారంతో మధ్యాహ్న భోజనం వల్ల‌ ప్రభుత్వ పాఠశాల పరపతి తగ్గి బ‌డుల‌లో ప్ర‌వేశాలు త‌గ్గిపోయాయ‌ని అన్నారు. ఒక్క సంవత్సరం లోనే 6,213 ప్రభుత్వ స్కూల్స్ మూత పడే దుస్థితికి రేవంత్ సర్కారు దిగజార్చింద‌ని హ‌రీష్ రావు మండిప‌డ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *