– రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా విడుదల
– ఎమ్మెల్యే పాయంతో కలసి విడుదల చేసిన మంత్రి తుమ్మల
భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15 : ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా లేక పంటల సాగుకు ఇబ్బందులు ఏర్పడ్డాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు.. సాగర్ ఆయకట్టుకు భరోసాగా మారిందన్నారు. మారేళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని నెలాఖరులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నీళ్ల దగ్గర రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. రాజీవ్ లింక్ కెనాల్‌కు గోదావరి జలాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విడుదల చేశారు. శనివారం అశ్వాపురం మండలం సీతారామ పంప్ హౌస్ వద్ద మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.. మోటార్ స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ఎవరూ కూడా దిగులు పడొద్దని, భూముల్లో పైప్‌లైన్ వేసిన మరలా పూడ్చి ఇస్తామని మంత్రి చెప్పారు. యధావిధిగా మళ్లీ వ్యవసాయం చేసుకోవచ్చని అన్నారు. పినపాకకి నీళ్లు ఇవ్వకుండా ఖమ్మంకి తీసుకెళ్లటం బాధగా ఉందన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎవరు ఎటువంటి రాజకీయాలు చేసినా నెలాఖరుకు మారేళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు