వరంగల్ యూత్ క్రెడాయి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభం
హన్మకొండ, ప్రజాతంత్ర, నవంబర్ 24 : రక్తదానం ప్రాణదానంతో సమానమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. భవన నిర్మాణాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రెడాయి సంస్థ సభ్యులను ఎమ్మెల్యే నాయిని రెడ్డి అభినందించారు. ఆదివారం హనుమకొండలోని కేయూసీ క్రాస్ రోడ్డులోని రిలయన్స్ కాంప్లెక్స్ ఆవరణలో వరంగల్ జిల్లా క్రెడాయి సంస్థ యూత్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఆరోగ్యావంతమైన సగటు మానవులు ఏడాదిలో కనీసం నాలుగు సార్లు రక్తదానం చేయాలనీ కోరారు. భవన నిర్మాణ రంగంతో పాటు ఇటువంటి సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రెడాయి సంస్థ సభ్యులను అభినందించారు.